రాష్ట్రీయం

మనోరంజకంగా పుస్తకప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహ్లాద, విజ్ఞాన పోటీలు
నేడు కడియం చేతులు మీదుగా ప్రారంభం
ప్రతి రోజు ఒక మంత్రి సందర్శన
అనుదినం పిల్లలకు పోటీలు
హైదరాబాద్, డిసెంబర్ 17: ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ పుస్తక ప్రదర్ళనను ఈసారి మనోరంజకంగా నిర్వహిస్తున్నట్టు ప్రదర్శన కమిటీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ చెప్పారు. కమిటీ ప్రధానకార్యదర్శి చంద్రమోహన్, ట్రెజరర్ రాజేశ్వరరావు, సాంబశివరావు, శోభన్‌బాబు తదితరులతో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 29వ హైదరాబాద్ పుస్తక ప్రదర్ళన ఈ నెల 18వ తేదీ సాయంత్రం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతులు మీదుగా ప్రారంభం అవుతుందని చెప్పారు.
దేశవ్యాప్తంగా ప్రచురణకర్తలు, కవులు 374 స్టాల్స్ ఏర్పాటు చేస్తుండగా, తెలంగాణ నుండే 178 స్టాల్స్ ఏర్పాటవుతున్నాయని, అనుదినం విద్యార్ధినీ విద్యార్ధులకు పోటీలు నిర్వహిస్తూ, పుస్తక ప్రదర్శనను ఆహ్లాదంగానూ, విజ్ఞాన సముపార్జన కేంద్రంగా తీర్చిదిద్దామని అన్నారు. ప్రతి రోజు రాష్ట్ర మంత్రి ఒకరు పుస్తక ప్రదర్శనను సందర్శిస్తారని, రాష్ట్ర సలహాదారు డాక్టర్ కె. వి. రమణ సహాయ సహకారాలతో ప్రదర్శన ప్రాంగణాన్ని తెలంగాణ కళా భారతి కొత్త పల్లి జయశంకర్ ప్రాంగణంగా మార్చామని అన్నారు.
ద్వారాలకు మఖ్దుం ద్వారంగానూ, సదాశివ ద్వారంగా సాహితీమూర్తుల పేర్లను పెట్టామని, ముగింపు కార్యక్రమానికి తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి వస్తారని అన్నారు. 25న కవిసమ్మేళనం నిర్వహిస్తున్నామని, చిత్తప్రసాద్ శతజయంతి కార్యక్రమాన్ని కూడా పుస్తక ప్రదర్శనలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. లాభాపేక్ష లేకుండా పుస్తకప్రియులకు కొత్త పుస్తకాలను పరిచయం చేసే వేదికగా దీనిని తీర్చిదిద్దామని చంద్రమోహన్ చెప్పారు. ఈ ఏడాది ప్రదర్శనకు పది లక్షల మంది వస్తారని భావిస్తున్నామని, తదనుగుణంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు.