రాష్ట్రీయం

పుస్తక ప్రియులకు పండగొచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదలైన పుస్తక ప్రదర్శన తొలిరోజే కిటకిట
హైదరాబాద్, డిసెంబర్ 19: పుస్తకప్రియులకు పండగొచ్చింది. 28 ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభమైన రోజు నుండే జనాదరణ పెరిగింది. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బుక్ ఫెయిర్‌లో శనివారం స్టాల్స్ అన్నీ కిటకిటలాడాయి. సంస్కృతి, రాజకీయాలు, సామాజిక అంశాలు, సాహిత్యం మరీ ముఖ్యంగా నవల, కవిత, కథల సంపుటిలు పోటీ పరీక్షల సమాచారం, పిల్లల పుస్తకాలు, జనరంజక గ్రంథాలు పాఠకులను ఆకట్టుకుంటున్నాయి. బోధనాభ్యసన ఉపకరణాలు, గ్రాఫ్‌లు, పటాలు, మోడల్స్, కంప్యూటర్ పాఠ్యాంశాలు, వ్యక్తుల జీవిత చరిత్రలు, ప్రముఖుల ప్రసంగాలు ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. ప్రతి స్టాల్‌లో చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకూ అంతా కనిపించడంతో నగరంలో మరోమారు సాహిత్యగుభాళింపులు విరజిమ్మాయి. జనం పెరగడంతో నిర్వాహకులు ఈసారి మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజు కవి సమ్మేళనం, పుస్తకాల ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ సాహిత్య చరిత్రలపై గ్రంథాల విడుదల, పిల్లలకు పోటీలు, మహిళా రచయితల సమ్మేళనాలతో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అందరినీ ఆకట్టుకుంటోందని అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ చెప్పారు. కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్, ట్రెజరర్ రాజేశ్వరరావు, సాంబశివరావు, శోభన్‌బాబు ప్రత్యేక ఏర్పాట్లులో తలమునకలయ్యారు.
పుస్తక ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ప్రచురణకర్తలు, సంపాదకులు, కవులు, రచయితలు , ఫేస్ బుక్ గ్రూప్‌లో ఉండి పుస్తకాలను ముద్రించిన వారు 374 స్టాల్స్ ఏర్పాటు చేస్తుండగా, తెలంగాణ నుండే 178 స్టాల్స్ ఏర్పాటయ్యాయి. శనివారం సైతం మరికొంత మంది ప్రచురణ కర్తలు వచ్చి స్టాల్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చారని నిర్వాహకులు తెలిపారు.
శనివారం నాటి నుండి ప్రతి రోజు విద్యార్ధినీ విద్యార్ధులకు డ్రాయింగ్, వక్తృత్వం, వ్యాసరచన పోటీలను నిర్వహిస్తూ, పుస్తక ప్రదర్శనను ఆహ్లాదంగానూ, విజ్ఞాన సముపార్జన కేంద్రంగా తీర్చిదిద్దామని గౌరీశంకర్ అన్నారు. ప్రతి రోజు వేలాది మంది పుస్తక ప్రియులతో పాటు ప్రముఖులు ఐదారుగురిని పిలిచి పరిచయం చేయించడం, వారి రచనలపై చర్చ, ఉపన్యాసాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్తపల్లి జయశంకర్ ప్రాంగణం పేరిట బుక్‌ఫెయిర్‌లో ద్వారాలకు మఖ్దుం ద్వారంగానూ, సదాశివ ద్వారంగా సాహితీమూర్తుల పేర్లను పెట్టారు. తొలి రోజు నుండే అమ్మకాలు భారీగా పెరిగాయని ప్రచురణ కర్తలు తెలిపారు.