తెలంగాణ

క్రీమీలేయర్ అందరికీ వర్తించదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐఏఎస్, ఐపిఎస్, చీఫ్‌జస్టిస్‌లకు మాత్రమే
అపోహలు నమ్మవద్దని ఎంపి బూర నర్సయ్యగౌడ్ పిలుపు
చిట్యాల, డిసెంబర్ 24: బిసిల రిజర్వేషన్‌లు ఆదాయ పరిమితిపై బిసి క్రీమీలేయర్‌పై వస్తున్న అపోహలను నమ్మొద్దని బిసి క్రీమీలేయర్ అందరికీ వర్తించదని, కేవలం నేరుగా ఎంపికయ్యే ఐఏఎస్, ఐపిఎస్ అధికారుకు, చీఫ్‌జస్టిస్‌లకు, కార్పొరేషన్ పదవులకే వర్తిస్తుందని భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. బిసి రిజర్వేషన్‌లపై ఇబ్బందులు కలుగుతాయని బిసి క్రీమీలేయర్‌పై అనవసర చర్చలు వ్యాఖ్యలు ఊహాగానాలేనని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలుగవన్నారు. వివిధ రాజకీయ పార్టీలు బిసి సంఘాలు బిసి క్రీమీలేయర్‌పై వచ్చే అపోహలను నమ్మకూడదని బిసి క్రీమీలేయర్ అనేది సామాన్యులకు వర్తించదన్నారు. ఆదాయ పరిమితి కూడా పెంపొందించబడినదని బిసి క్రీమీలేయర్‌లోకి 1శాతం బిసిలు కూడా రారని అందరికీ వర్తించదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వారికి వచ్చే జీతభత్యాలు, ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు, గ్రూప్-2 అధికారులకు బిసి క్రీమీలేయర్ ఏమాత్రం వర్తించదని ఎవరూ కూడా ఆందోళన చెందవద్దన్నారు. బిసి క్రీమీలేయర్ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకురాలేదని, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్(ఎన్‌సిబిసి) ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 15లక్షలు, ప్రైవేటు ఉద్యోగులకు రూ. 30లక్షలు ఆర్థిక పరిమితిని విధించిందన్నారు. కొంతమంది అధికారులకు అవగాహనారాహిత్యంతో క్రీమీలేయర్ నోటిఫికేషన్‌ను జతచేశారని దానివలన బిసిలు ఆందోళన చెందాల్సి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం బిసిల అభ్యున్నతికి పాటుపడాలని ముఖ్యంగా కేంద్రంలో ఓబిసి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, నేషనల్ కమీషన్ బ్యాక్వర్డ్ క్యాస్ట్‌కు చట్టబద్ధతను కల్పించాలని, బిసిలకు రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిసిల రిజర్వేషన్‌ల అమలుకై కేంద్రంపై 100మంది బిసి ఎంపిలు పోరాడుతున్నామన్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎంతో కృషి చేస్తున్నారని వ్యవసాయ మార్కెట్‌ల పదవుల్లో రిజర్వేషన్లను కల్పిస్తామనడం సిఎం కెసిఆర్‌కు ఆ ఘనత దక్కిందన్నారు. 2005సం.లో ఎంపిగా ఉన్న సిఎం కెసిఆర్ బిసిలకు రిజర్వేషన్‌లు కల్పించాలని కోరుతూ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిశారని ఆర్థిక పరిమితులను పెంచాలని కోరారన్నారు. కులమతాలకతీతంగా రాష్ట్రంలోని అన్ని కులాలు మతాలు వర్గాలు అభివృద్ధిచెందాలని సమానదృష్టితో చూస్తూ సిఎం కెసిఆర్ ఆయూత చండీయాగాన్ని నిర్వహిస్తున్నారన్నారు. మంచి సంసృతి సంప్రదాయాలకు విలువనిచ్చేది తెలంగాణ అని ప్రజలు కూడా సంస్కతి సంప్రదాయాలను నేటికి కూడా మరువలేదన్నారు. సిఎం కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, జడ్పీటీసిలు, ఎంపిటిసిలు, వివిధ పార్టీల నాయకుకులు కార్యకర్తలు తెరాసలో చేరుతున్నారన్నారు. తెరాసలో చేరడం అప్రస్వామికం అన్యాయమైతే, తెరాసది తప్పే అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెరాస ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో అప్పటి సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేర్చుకున్నప్పుడు అప్రజాస్వామికం.. అన్యాయం.. రాజకీయ విలువలు గుర్తుకురాలేదా అని, నాడు కాంగ్రెస్‌లో చేరికలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెబితే ఇప్పటి చేరికలపై తాము మాట్లాడతామని ఆయన అన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతారనే అభద్రతాభావంతో తెరాసలో చేరికలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వాటిని తాము ఖండిస్తున్నామన్నారు. పార్టీల వలసలను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీనేనని ఎవరు అడిగినా చెబుతారని నాటి చేరికలను ఒకసారి గుర్తుంచుకోవాలన్నారు.