జాతీయ వార్తలు

షీనాబోరా కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసు బుధవారం కీలక మలుపుతిరిగింది. ఈ కేసులో నిందితుడైన ఇంద్రాణి మాజీ కారు డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ తాను అప్రూవర్‌గా మారి, విచారణకు సహకరిస్తానని సిబిఐ ప్రత్యేక కోర్టులో పేర్కొన్నాడు. అప్రూవర్‌గా మారతానని కొద్దిరోజుల క్రితం రాయ్ సిబిఐ జడ్జికి రెండు పేజీల లేఖ రాశాడు. దీంతో రాయ్‌ను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మహాజన్ బుధవారం విచారించారు. షీనాబోరాను గొంతు నులిమి చంపారని, ఇందుకు తాను కూడా సహకరించానని ఆయన వివరించాడు. హత్య చేసినందుకు తాను సిగ్గుపడుతున్నానని, తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, తనను ఎవరూ బెదిరించడం లేదని, తాను చెప్పే నిజాలను కోర్టు పరిశీలించాలని కారు డ్రైవర్ కోరారు. ఇతను అప్రూవర్‌గా మారినందున ఈ నెల 17న స్పందన తెలియజేయాలని సిబిఐ అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు.