రాష్ట్రీయం

విలువైన భూములు దిగమింగుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్కార్‌పై బొత్స ధ్వజం
విశాఖపట్నం, డిసెంబర్ 7: రాష్ట్రంలో విలువైన భూములను తెలుగుదేశం పార్టీ నాయకులు దిగమింగుతున్నారని వైకాపా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సోమవారం విశాఖలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నగర సమీపంలో ఎకరా ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే 50 ఎకరాల భూమిని ఎకరా 50 లక్షల రూపాయలకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్ స్నేహితునికి కట్టబెట్టారని ఆరోపించారు. జగ్గంపేటలో 250 కోట్ల విలువైన భూమిని టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌కు కేవలం 21 కోట్ల రూపాయలకే కట్టబెట్టారన్నారు. రాష్ట్రంలో భూ దందా భయంకరంగా సాగుతోందని, ఈ భూ కేటాయింపులపై ఇప్పటికే జారీ చేసిన జిఓలను రద్దు చేయాలని బొత్స డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలు రోజు రోజుకూ శృతిమించుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు యూనిట్ల ఇసుక 10 నుంచి 15 వేల రూపాయలు ఉంటే, ఇప్పుడు అది 30 నుంచి 40 వేలకు పెరిగిందని ఆయన అన్నారు. డబ్బు కట్టినా, ఇసుక వినియోగదారులకు చేరడం లేదని అన్నారు. జన చైతన్య యాత్రల పేరుతో చంద్రబాబు రాష్ట్రంలో తిరుగుతున్నారని, వరద బాధితులకు ఎటువంటి హామీ ఇవ్వలేకపోయారని అన్నారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఈనెల 10వ తేదీన జగన్ చింతపల్లిలో పర్యటించనున్నారని బొత్స చెప్పారు.