ఆటాపోటీ

బాక్సింగ్ కొత్త పుంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈఏడాది భారత బాక్సర్లు కొత్త పుంతలు తొక్కారు. కానీ, బాక్సింగ్ సమాఖ్య సస్పెన్షన్‌కు గురై పరువు కోల్పోయింది. ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ అనూహ్యంగా ప్రొఫెషనల్ బాక్సర్‌గా అవతారం ఎత్తడం భారత బాక్సింగ్ చరిత్రలో కొత్త అధ్యాయం. ప్రొఫెషనల్ బాక్సర్‌గా అతను మొదటి మూడు ఫైట్స్‌లోనూ విజయాలను సాధించి హ్యాట్రిక్ నమోదు చేయడం విశేషం. రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిమానులు ఆశపడుతున్న సమయంలోనే విజేందర్ ప్రొఫెషనల్‌గా మారుతున్నట్టు ప్రకటించి విమర్శలకు గురయ్యాడు. స్వార్థ ప్రయోజనాలను ఆశించి అతను దేశానికి ప్రాతినిథ్యం వహించాల్సిన బాధ్యత నుంచి వైదొలిగాడన్న ఆరోపణలు జోరందుకున్నాయి. అయితే, మొదటి మూడు పోటీల్లో నెగ్గడం ద్వారా అతను తనపై వచ్చిన విమర్శలనను కొంత వరకైనా తగ్గించుకోగలిగాడు.
యువ బాక్సర్ శివ్ థాపా ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకొని సంచలనం సృష్టించాడు. 56 కిలోల విభాగంలో పోటీపడిన అతను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎదిగాడు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పతకం సాధించిన మూడో భారత బాక్సర్‌గా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించాడు. మన్దీప్ జగ్రా (69 కిలోల విభాగం), వికాస్ కృష్ణన్ (75 కిలోల విభాగం) తదితరులు కూడా దేశ కీర్తిప్రతిష్ఠలను పెంచేలా అంతర్జాతీయ వేదికలపై రాణించారు.
బాక్సర్లు ఒక్కో మెట్టు ఎదుగుతుండగా, బాక్సింగ్ ఇండియా ఒక్కో మెట్టు దిగుతూ పరువును దిగజార్చుకుంది. అంతర్గత కుమ్ములాటలు సమాఖ్యను రోడ్డుకెక్కించాయి. అధ్యక్షుడు సందీప్ జజోడియా, కార్యదర్శి జై కోలీలను బాక్సింగ్ సంఘాలు తొలగించడంతో సంక్షోభం నెలకొంది. చివరికి అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఎఐబిఎ) జోక్యం చేసుకొని బాక్సింగ్ ఇండియాను రద్దు చేసింది. తాజా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఇలావుంటే, ప్రొఫెషనల్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (పిబిఒఐ), ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (ఐబిసి) లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దేశంలో ప్రొఫెషనల్ బాక్సింగ్ అభివృద్ధే ధ్యేయంగా ప్రకటించుకున్నాడు. ఎవరికి లైసెన్స్ దక్కుతుందో చూడాలి.
ఫిట్నెస్ లేని యోగేశ్వర్
ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించిన మరో రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఫిట్నెస్‌లో లేక పలు టోర్నీలకు గైర్హాజరయ్యాడు. అయితే, రియో ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని అతను ఎంపిక చేసుకున్న టోర్నీల్లో పాల్గొంటున్నాడు. అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ మాసంలో లాస్ వెగాస్‌లో జరిగిన ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ఫిట్నెస్ లేకపోయినా యోగేశ్వర్ వెళ్లడం విమర్శలకు గురైంది. మోకాలి నొప్పి వేధిస్తున్నప్పటికీ ఆ వాస్తవాన్ని బయటకు రాకుండా కప్పిపుచ్చి లాస్ వెగాస్‌కు వెళ్లడం దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడమే అనే విమర్శలు వెల్లువెత్తాయి. పోటీకి దిగకుండానే అతను వెనక్కు తిరిగి రావడంతో ఉద్దేశపూర్వకంగానే ప్రజా ధనాన్ని వృథా చేశాడని అభిమానులు సైతం ఆగ్రహించే పరిస్థితి తెచ్చుకున్నాడు. అయితే, ప్రో రెజ్లింగ్ తొలి బౌట్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్స్ రజత పతక విజేత నవ్రజొవ్ ఇక్తియార్ (ఉజ్బెకిస్థాన్)ను ఓడించి ఫిట్నెస్ సమస్య లేదని నిరూపించుకున్నాడు.