జాతీయ వార్తలు

మా బాయ్ఫ్రెండ్స్ ముందే రేప్ చేశారు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: తమను రక్షించాలని ఏడ్చామని, ఎవరూ ఆదుకోలేదని ఢిల్లీ అమన్ విహార్ బాధితుల్లో ఓ అమ్మాయి విలపించింది. ఐదుగురు దుండుగులు తమపై లైంగికదాడి చేస్తుంటే తమ బాయ్ఫ్రెండ్స్ తమను కాపాడే ప్రయత్నం చేయలేదని చెప్పింది. ఢిల్లీలో ఇద్దరు టీనేజి యువతులపై సామూహిక లైంగికదాడి జరిగిన సంగతి తెలిసిందే.
17, 18 ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులు తమ స్నేహితులతో కలిసి రాత్రి 7 గంటల ప్రాంతంలో ముకుంద మెట్రో స్టేషన్ సమీప ప్రాంతానికి వెళ్లారు. నలుగురం కలసి ఓ నిర్జన ప్రదేశంలో కూర్చుని ఉండగా, ఐదుగురు దుండగులు వచ్చి వేధించారని బాధితురాలు చెప్పింది. నిందితులు కర్రలు తీసుకుని బాయ్ఫ్రెండ్స్ను కొట్టి, తమను బలవంతంగా తీసుకెళ్లి దారుణానికి పాల్పడినట్టు తెలిపింది. బాయ్ఫ్రెండ్స్ తమను కాపాడుతారని భావించామని, సాయం చేయమని అరిచామని, వారు తమను రక్షించే ప్రయత్నం చేయలేదని బాధితురాలు వెల్లడించింది.