క్రీడాభూమి

బ్రిటన్ డబుల్ ధమాకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 25: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ గ్లామ్‌లో బ్రిటన్ సోమవారం డబుల్ ధమాకా మోగించింది. మహిళల సింగిల్స్‌లో జొహన్నా కొన్టా క్వార్టర్ ఫైనల్స్ చేరగా, పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ ఆండీ ముర్రే కూడా క్వార్టర్స్‌లో స్థానం సంపాదించాడు. నాలుగో రౌండ్‌లో అతను బెనార్డ్ టోమిక్‌ను 6-4, 6-4, 7-6 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. చివరి సెట్‌లో ప్రత్యర్థి నుంచి కొంత ప్రతిఘటన ఎదురైనప్పటికీ ఆ సవాలును ముర్రే అధిగమించగలిగాడు. కెనడాకు చెందిన 13వ సీడ్ ఆటగాడు మిలోస్ రవోనిక్ కూడా క్వార్టర్స్ చేరాడు. నాలుగో రౌండ్‌లో అతను జెయింట్ కిల్లర్, 16వ సీడ్ స్టానిస్లాస్ వావ్రిన్కాపై 6-4, 6-3, 5-7, 6-3 స్కోరుతో విజయం సాధించాడు. గేల్ మోన్ఫిల్స్ 7-5, 3-6, 6-3, 7-6 తేడాతో ఆండ్రె కుజ్నెత్సొవ్‌ను ఓడించాడు. మరో మ్యాచ్‌లో డేవిడ్ ఫెరర్ 6-4, 6-4, 7-5 తేడాతో బలమైన సర్వీసులకు పేరొందిన జాన్ ఇస్నర్‌ను ఇంటిదారి పట్టించాడు.