బిజినెస్

ఆరు రోజుల లాభాలకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెనె్సక్స్ 171 పాయింట్లు పతనం * 7,500 పాయింట్ల దిగువకు నిఫ్టీ

ముంబయి, మార్చి 10: మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో పాటుగా అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నేపథ్యంలో గత ఆరు రోజులుగా లాభాల మాటలో సాగిన దేశయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలు చవి చూశాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 171 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ సైతం 7,500 పాయింట్ల దిగువకు పడిపోయింది. వాస్తవానికి నిన్నటి ముగింపుకన్నా పై స్థాయిలో ప్రారంభమైన సెనె్సక్స్ ఆ తర్వాత మరికాస్త పెరిగింది. అయితే ఇటీవలి కాలంలో లాభాలు ఆర్జించిన స్టాక్స్‌లో లాభాల స్వీకరణకు మదుపరులు దిగడంతో సెనె్సక్స్ చివరికి 170.62 పాయింట్ల నష్టంతో 24,623.34 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి కొంతమేరకు బలపడ్డం పతనాన్ని కొంతమేరకు ఆపగలిగింది. గత ఆరు రోజుల్లో సెనె్సక్స్ 1792 పాయింట్లు లాభపడడం తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ తర్వాత సెనె్సక్స్ ఇన్ని రోజులు లాభాల్లో సాగడం ఇదే మొదటిసారి. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 45.65 పాయింట్లు నష్టపోయి 7486.15 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తంమీద సెనె్సక్స్‌లోని 30 కంపెనీల స్టాక్స్‌లో 20 స్టాక్స్ నష్టపోగా, పది మాత్రం లాభపడ్డాయి. డాలరుతో రూపాయి 22 పైసల మేర బలపడింది. మరోవైపు మిగతా ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి, ఐరోపా మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కావడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బిహెచ్‌ఇఎల్ షేర్లు అత్యధికంగా 2.93 శాతం దాకా పడిపోగా, ఆర్‌ఐఎల్, ఇన్ఫోసిస్ షేర్లు కూడా బాగానే పడిపోయాయి. నష్టపోయిన వాటిలో గెయిల్, ఎల్‌అండ్‌టి, ఎస్‌బిఐ, ఐటిసి, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఎంఅండ్‌ఎం, హీరో మోటోకార్ప్ ప్రధానంగా ఉన్నాయి. కాగా, ఏసియన్ పెయింట్స్, హెచ్‌డిఎఫ్‌సి, మారుతి సుజుకి, భారతీ ఎయిర్‌టెల్, సిప్లా, సన్‌ఫార్మా, ఎన్‌టిపిసి, ఒఎన్‌జిసి, బజాజ్ ఆటో, టాటా స్టీల్, టాటా మోటార్స్ షేర్లు పెరిగాయి.