అంతర్జాతీయం

వేరుకుంపటికి ఖాయమైంది.. బ్రెగ్జిట్‌ ఉత్కంఠకు తెర..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్‌: యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోవడమనేది ఎట్టకేలకు ఖాయమైంది. బ్రెగ్జిట్‌పై తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. గురువారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఉన్నామంటూ 51.8 శాతం మంది, వ్యతిరేకంగా 48.2 శాతం ప్రజలు మద్దతు ప్రకటించారు. దీంతో బ్రిటన్‌ వేరుపడటం ఖాయమైంది. శుక్రవారం వెలువడిన ఫలితాల్ని చూస్తే యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బయటకు వచ్చే విషయంలో స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణలో వెలువడిన ఫలితాల ప్రకారం.. సమాఖ్య నుంచి బ్రిటన్‌ విడిపోవాలనుకునే వారి సంఖ్య 1,74,10,742గా ఉండగా.. కూటమితో కలిసుందామనుకునే వారి సంఖ్య 1,61,41,241గా ఉంది. బ్రెగ్జిట్‌వైపే ఎక్కువ మంది ఆసక్తి చూపడంతో.. బ్రిటన్‌ వేరుపడటం స్పష్టమైంది. 12.69లక్షల ఆధిక్యంతో బ్రెగ్జిట్‌ పక్కా అయింది.