అంతర్జాతీయం

బ్రిటన్‌కు అక్టోబర్‌లో కొత్త ప్రధాని !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ‘బ్రెగ్జిట్’లో మెజారిటీ ప్రజలు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరాన్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. బ్రెగ్జిట్ తీర్పు వెలువడిన వెంటనే ఆయన భార్య సమంతా కలిసి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ- ‘అక్టోబర్‌లో బ్రిటన్‌కు కొత్త ప్రధాని వస్తారు’ అని అన్నారు. ‘ప్రధాని పదవిలో ఇక మూడు నెలలు మాత్రమే ఉంటా.. అక్టోబర్‌లో జరిగే కన్సర్వేటివ్ పార్టీ సమావేశంలో కొత్త ప్రధానిని ఎన్నుకుంటారు.. నా అభిప్రాయానికి భిన్నంగా దేశ ప్రజలు తీర్పు ఇచ్చినందున ఇంకా పదవిలో ఉండడం సరికాదు..’అని ఆయన తెలిపారు. తన మనోగతానికి విరుద్ధంగా బ్రెగ్జిట్‌లో మెజారిటీ ప్రజలు తీర్పు ఇవ్వడంతో కామెరాన్ ఈ ప్రకటన చేశారని పరిశీలకులు భావిస్తున్నారు.