తెలంగాణ

విశ్వనగరంగా హైదరాబాద్: బొంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారంతో కృషి చేస్తానని మేయర్ అభ్యర్థిగా ఎన్నికైన బొంతు రామ్మోహన్ అన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో గెలిచిన తెరాస కార్పొరేటర్‌తో గురువారం ఉదయం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మేయర్‌గా అవకాశం రావడం తన అదృష్టమని, నగరంలో నివసించే అన్ని ప్రాంతాల వారికి అభివృద్ధి కార్యక్రమాలు అందేలా కృషిచేస్తానన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు అనుసరించాల్సిన వ్యూహాన్ని మంత్రి కెటిఆర్ నిర్దేశించారు. మేయర్‌గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా ఫసియుద్దీన్ పేర్లను ఆయన ప్రకటించారు. మంత్రులు తలసాని, నాయని, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశంలో పాల్గొన్నారు.