కృష్ణ

విద్యలవాడకే తలమానికం వౌంట్ ఫోర్ట్ బ్రదర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, డిసెంబర్ 22: విద్యలవాడగా పేరుగాంచిన విజయవాడలో నాలుగు దశాబ్దాలుగా క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన అత్యుత్తమ విద్యనందిస్తున్న ఘనత వౌంట్ ఫోర్టు బ్రదర్స్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్ స్కూల్‌కే దక్కుతుందని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం పటమటలోని ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్ స్కూల్‌లో పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్ స్కూల్ ఎందరో విద్యార్థులకు బంగారు బాటలు వేసిందన్నారు. ప్రపంచ దేశాల్లో వౌంట్ ఫోర్టు బ్రదర్స్‌కు చెందిన విద్యా సంస్థలు విద్యనందించటంలో ప్రతిష్టాత్మకంగా నిలిచాయని అన్నారు. ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ బ్రదర్ చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ ఉత్తమ విద్యనందిస్తూ విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాలను ప్రోత్సహించటంలో ముందంజలో ఉందన్నారు. 2014-15 విద్యా సంవత్సరం సిబిఎస్‌సి 10వ తరగతిలో 10 కి 10 పాయింట్లు సాధించిన 46 మంది విద్యార్థులకు, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బెస్ట్ ఔట్ గోయింగ్ విద్యార్థులకు బంగారు పతకాలు, నగదు బహుమతులు, చాంపియన్‌ట్రోఫీలు, మెమొంటోలు, ప్రంశంసా పత్రాలు మేయర్ చేతుల మీదుగా అందజేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బ్రదర్ జోస్, ఎన్‌ఎస్‌ఎం ఓఎస్‌ఎ ప్రెసిడెంట్ సురేందర్ సింగ్ సహాని, ఎ.ఆనంద్, కె.తోమస్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.