బిజినెస్

భారత్‌లోనూ ఈబే ఇండియా ‘బ్లాక్ ఫ్రైడే’ సేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 20: తమ పాపులార్ ‘బ్లాక్ ఫ్రైడే’ సేల్‌ను భారత్‌కు తెస్తున్నట్లు ఆన్‌లైన్ మార్కెటీర్ ఈబే శుక్రవారం తెలియజేసింది. అమెరికాలో క్రిస్‌మస్ సందర్భంగా హాలిడే షాపింగ్ సీజన్‌కు బ్లాక్ ఫ్రైడేతో ఈబే తెరతీస్తుంది. ఇందులో భారీ రాయితీలతో గొప్ప ఆఫర్లను వినియోగదారులకు అందిస్తుంది. అంతర్జాతీయంగా ఈ నెల 27న బ్లాక్ ఫ్రైడేను నిర్వహిస్తున్నారు. అయితే దీనికి ప్రమోషన్‌గా ఈ శుక్రవారం నుంచే వివిధ అంతర్జాతీయ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది ఈబే ఇండియా. ఎలక్ట్రానిక్స్, లైఫ్‌స్టైల్, గృహోపకరణాలు, స్పోర్ట్స్, ఫిట్నెస్ తదితర వస్తువుల ధరలపై భారీ తగ్గింపు ఉంటుందని చెప్పింది. ఈ నెల 30 వరకు జరిగే ప్రమోషనల్ పీరియడ్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులపై 45 శాతం, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులపై 50 శాతం రాయితీని భారతీయ వినియోగదారులు అందుకోవచ్చని స్పష్టం చేసింది.
ఉత్పత్తిలోకి రాజమండ్రి జిఎమ్‌ఆర్
గ్యాస్ విద్యుత్ ప్లాంట్
న్యూఢిల్లీ, నవంబర్ 20: రాజమండ్రిలో 768 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ను తమ అనుబంధ సంస్థ ఉత్పత్తిలోకి తెచ్చినట్లు జిఎమ్‌ఆర్ ఎనర్జీ లిమిటెడ్ శుక్రవారం తెలియజేసింది. జిఎమ్‌ఆర్ రాజమండ్రి ఎనర్జీ లిమిటెడ్ (జిఆర్‌ఇఎల్) దీన్ని నిర్వహిస్తోంది. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తయిన విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలకు సరఫరా చేస్తామని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు జిఎమ్‌ఆర్ ఎనర్జీ తెలిపింది. ఈ-బిడ్ ఆర్‌ఎల్‌ఎన్‌జి పథకంలో భాగంగా ప్రారంభమైన గ్యాస్ సరఫరాతో ఈ విద్యుత్ ప్లాంట్ నడుస్తుందని చెప్పింది. మార్చిలో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆరంభించినది తెలిసిందే.