బిజినెస్

మూతపడనున్న హెచ్‌ఎస్‌బిసి ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 27: గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌ఎస్‌బిసి.. భారత్‌లో తమ ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ‘ఇక్కడి (్భరత్) మా గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ కార్యకలాపాలపై ఓ వ్యూహాత్మక సమీక్ష అనంతరం వీటిని (వ్యాపార కార్యకలాపాలను) నిలిపివేయాలని మేము నిర్ణయించుకున్నాం.’ అని బ్యాంక్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. శంతను అంబేద్కర్ నేతృత్వంలోని ఓ 70 మందిని రిటైల్ బ్యాంక్‌లోకి పంపించనున్నట్లు తెలిపారు. అయితే వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రైవేట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు ఆగిపోతాయని, కొందరు కస్టమర్లు తమ గ్లోబల్ రిటైల్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్ వేదికైన హెచ్‌ఎస్‌బిసి ప్రీమియర్‌లోకి వెళ్తారని పేర్కొన్నారు. ఇదిలావుంటే శుక్రవారం ఉదయమే ప్రైవేట్ బ్యాంకింగ్ కార్యకలాపాల మూసివేతకు సంబంధించిన సమాచారాన్ని సిబ్బందికి ఈ-మెయిల్స్ ద్వారా బ్యాంక్ పంపించింది. కాగా, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌లాండ్ తమ ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన కేవలం రెండు నెలల్లోనే మరో ప్రముఖ విదేశీ బ్యాంక్ ఇదే దిశగా పయనించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.