బిజినెస్

మారుతి సుజుకి దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి దూకుడు కొనసాగుతోంది. గత నెల నవంబర్‌లో దేశీయ మార్కెట్‌లో అమ్ముడైన ప్యాసింజర్ వాహనాల్లో టాప్-10 మోడల్స్‌లో ఆరు మారుతి సుజుకికి చెందినవే ఉన్నాయి. మారుతి ఆల్టో ఎప్పటిలాగే తొలి స్థానంలో నిలిచింది. 21,995 యూనిట్లు అమ్ముడైంది. గత ఏడాది నవంబర్‌లో 24,201 యూనిట్లు అమ్ముడైయ్యాయి. రెండో స్థానంలోనూ మారుతి డిజైర్ ఉండగా, ఈ నవంబర్‌లో 15,463 యూనిట్లు, పోయినసారి నవంబర్‌లో 12,020 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. మూడో స్థానంలో కూడా మారుతికి చెందిన మోడలే అయిన వాగనార్ ఉంది. ఈసారి 13,986 యూనిట్ల అమ్మితే, క్రిందటిసారి 13,545 యూనిట్లుగా ఉన్నాయి. ఇక నాలుగో స్థానంలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నిలిచింది. గతంతో పోల్చితే 8,396 యూనిట్ల నుంచి 12,899 యూనిట్లకు గ్రాండ్ ఐ10 అమ్మకాలు పెరిగాయి. ఐదో స్థానంలో మారుతి స్విఫ్ట్ ఉండగా, క్రిందటిసారితో చూస్తే 17,900 యూనిట్ల నుంచి 11,859 యూనిట్లకు దిగజారాయి. ఆరో స్థానంలో హ్యుందాయ్ ఎలైట్ ఐ20, ఏడో స్థానంలో మారుతి లేటెస్ట్ మోడల్ బాలెనో, ఎనిమిదో స్థానంలో హ్యుందాయ్ ఇయాన్, తొమ్మిదో స్థానంలో మారుతి సెలీరియో, పదో స్థానంలో మహీంద్ర అండ్ మహీంద్ర బొలెరో ఉన్నాయి. గత ఏడాది నవంబర్ అమ్మకాలతో చూస్తే టాప్-10లో ఈసారి హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఆరో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకగా, మారుతి స్విఫ్ట్ రెండో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ఇక హోండా పాపులర్ మోడల్ సిటి ఈ ఏడాది నవంబర్‌లో టాప్-10 సెల్లింగ్ మోడల్స్ నుంచి వైదొలిగింది. ఈ మేరకు వివరాలను భారతీయ ఆటోరంగ సమాజం సియామ్ తెలియజేసింది.