బిజినెస్

ఆటోమేషన్‌తో మానవ శక్తి నిర్వీర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 5: భారత్‌లో 69 శాతం ఉద్యోగాలను ఆటోమేషన్ ప్రభావితం చేస్తోందని ప్రపంచ బ్యాంక్ పరిశోధన ఒకటి తెలిపింది. చైనాలో ఇది 77 శాతంగా ఉందని, ఇథియోపియాలోనైతే 85 శాతమని వెల్లడించింది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో అన్నిం టా యాంత్రిక శక్తి విస్తరిస్తోందని, దీనివల్ల మానవ శక్తి నిర్వీర్యమవుతోందని చెప్పింది. పరిశ్రమల్లో మనుషుల కంటే యంత్రాల సంఖ్య ఎక్కువవడం వల్ల నానాటికి నిరుద్యోగం పెరిగిపోతోందని ప్రపంచ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. యాంత్రీకరణ మరింత పెరిగితే చాలా మందికి ఉపాధి కరువవడం ఖాయమని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంప్రదాయక ఆర్థిక ప్రగతిని యాంత్రిక శక్తి దెబ్బతీస్తోందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ కిమ్ అన్నారు. యాంత్రికరణ, సాంకేతికతలతో సంప్రదాయ పారిశ్రామిక ఉత్పత్తి పడిపోతోందని, దీంతో పరిశ్రమల్లో మానవ వనరుల అవసరం తగ్గి పోతోందని, ఇది ఉద్యోగవకాశాలకు దెబ్బ అని కిమ్ ఆవేదన వెలిబుచ్చారు. భారత్, చైనా, ఇథియోపియాల్లో ఆటోమేషన్ మరింతగా పెరి గితే, చాలామందికి ఉద్యోగాలు లేక నిరు ద్యోగ శాతం పెరుగుతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది శ్రేయస్కరం కాదన్నారు.

డెట్ మేనేజ్‌మెంట్ తరలింపు మొదలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 5: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నుంచి డెట్ మేనేజ్‌మెంట్ తరలింపు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. పబ్లిక్ డెట్ మేనేజ్‌మెంట్ సెల్ ద్వారా ఏర్పాటయ్యే స్వతంత్ర ఏజెన్సీకి డెట్ మేనేజ్‌మెంట్ బాధ్యతను అప్పగించనుంది సర్కారు. పబ్లిక్ డెట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (పిడిఎమ్‌ఎ) పేరుతో పనిచేసే సదరు స్వతంత్ర ఏజెన్సీ ఈ డెట్ మేనేజ్‌మెంట్‌ను చూడనుంది. ఆర్థిక వ్యవహారాల శాఖలో సంయుక్త కార్యదర్శి (బడ్జెట్) పిడిఎమ్‌సి ఇంచార్జీగా వ్యవహరిస్తారు. ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం పిడిఎమ్‌సి కార్యకలాపాలు జరుగుతాయి.

114 పాయింట్లు కోల్పోయన సెనె్సక్స్
ముంబయి, అక్టోబర్ 5: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. గత మూడు రోజుల లాభాలకు బ్రేక్‌వేస్తూ మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకే పెద్దపీట వేశారు. నిజానికి మంగళవారం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) భారత వృద్ధిరేటుకు సంబంధించి వెల్లడించిన ఆశాజనక అంచనా నేపథ్యంలో ఉదయం సూచీలు లాభాల్లోనే కదలాడినప్పటికీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇసిబి) ఉద్దీపనలను వెనక్కి తీసుకుంటుందని, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచనుందని వచ్చిన సమాచారం నష్టపరిచింది. ఈ క్రమంలోనే చివరకు 113.57 పాయింట్లు కోల్పోయిన బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 28,220.98 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 25.20 పాయింట్లు పడిపోయి 8,743.95 వద్ద నిలిచింది.