బిజినెస్

మహా పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ త్వరలో వడ్డీరేట్లను పెంచనుందనే అంచనాలు బులియన్ మార్కెట్‌ను ఒక్కసారిగా వణికించాయి. దీంతో బుధవారం ఒక్కరోజే 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 730 రూపాయలు క్షీణిస్తే, కిలో వెండి వెల 1,750 రూపాయలు దిగజారింది. పుత్తడి ధర ఈ ఏడాదిలో కేవలం ఒక్కరోజులో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే ప్రథమం. తాజా క్షీణతతో 10 గ్రాముల విలువ 30,520 రూపాయలకు పడిపోయింది. 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర 30,370 రూపాయలుగా ఉంది.
అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలుండటంతో సుధీర్ఘకాలం నుంచి వడ్డీరేట్ల పెంపు జోలికి వెళ్లని ఫెడ్ రిజర్వ్.. ఇక వడ్డీరేట్లను పెంచబోతోందన్న వార్తలు మార్కెట్ వ్యాప్తంగా విస్తరించాయి. దీంతో మదుపరులు తమ పెట్టుబడులను బంగారం, వెండి నుంచి డాలర్ వైపు మళ్లించగా, దేశీయంగానూ తగ్గిన డిమాండ్ ధరల పతనానికి దారితీసింది.
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఔన్సు బంగారం ధర 1,300 డాలర్ల దిగువకు చేరి 1,268.40 డాలర్ల వద్ద నిలిచింది. జూన్ నుంచి గమనిస్తే ఈ స్థాయికి ధరలు పడిపోవడం ఇదే. ఇక కిలో వెండి ధర కూడా 43,250 రూపాయలకు చేరింది.