బిజినెస్

‘టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు మధ్య, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ప్రయోజనాలను పొందాలని కేంద్ర ప్రభుత్వ చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ అరవింద్ పట్వారి సూచించారు. శుక్రవారం ఇక్కడ సిఐఐ తెలంగాణ విభాగం మేక్ ఇన్ ఇండియాపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ పరిశ్రమల్లో పోటీతత్వం పెరగాలన్నారు. ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకుని టర్నోవర్‌ను పెంచుకోవాలన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్, ఎగుమతి వస్తువుల్లో లోపాలకు తావులేకుండా చూసుకోవాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, డేటా బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎస్‌బిఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ రక్షణ రంగ సంస్థలు, చిన్న, మధ్యతరహా సంస్థల మధ్య అనుసంధానం ఉండాలన్నారు. ఏరోస్పేస్ రక్షణ సంస్థ ఉపాధ్యక్షుడు అంకుర్ గుప్తా మాట్లడుతూ నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయాలని కోరారు. సిఐఐ తెలంగాణ ఎంఎస్‌ఎంఇ విభాగం కన్వీనర్ మహేష్ దేశాయ్ సిఐఐ తెలంగాణ చైర్మన్ నృపేందర్ రావు తదితరులు సదస్సులో ప్రసంగించారు.