బిజినెస్

చెరకు రైతులకే పర్చేజ్ టాక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరానికి వసూలు చేసే చెరకు కొనుగోలు పన్ను (పర్చేజ్ టాక్స్)ను రైతులకే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చక్కెర మిల్లుల్లో టన్ను చెరకుపై 60 రూపాయలు, ఖండసారి మిల్లుల్లో టన్ను చెరకుపై 22 రూపాయలు పర్చేస్ టాక్స్ వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేస్తారు. అయతే దీన్ని రైతులకే తిరిగి ఇవ్వాలని జీఓలో పేర్కొన్నారు. ఫ్యాక్టరీల యాజమాన్యాలు చెరకు ధరతో కలిపి, అమ్మకం పన్నును రైతులకు చెల్లించాలని జీఓలో స్పష్టం చేశారు. అన్ని రకాల చక్కెర, ఖండసారి ఫ్యాక్టరీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి.