బిజినెస్

ఆన్‌లైన్ రుణ సంస్థలతో వైడర్ భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: పండగల సందర్భంగా వైడర్ అనే సంస్థ పలు అన్‌లైన్ రుణ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. తక్కువ డాక్యుమెంటేషన్‌తో రిటైలర్లకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలను ఇస్తామని వైడర్ పేర్కొంది.
దీపావళి వరకు కొనుగోలు మొత్తంపై వచ్చే వడ్డీని వైడర్ చెల్లిస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ విలువ పొందేలా వడ్డీలేని రుణాల సదుపాయాలను ప్రవేశపెట్టి రిటైలర్ల వ్యాపారం అభివృద్ధికి దోహదపడుతామని తెలిపింది. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్, ఇంటి అలంకరణ విక్రయాల్లో దీపావళి అమ్మకాల వాటా 40 శాతం ఉంటుందంది. వడ్డీలేని రుణం ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు ఉంటుంది.