బిజినెస్

సంక్షోభంలో జ్యూట్ మిల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 27: జ్యూట్ మిల్లులు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయ. మిల్లు కార్మికుల పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు చందంగా మారుతోంది. మిల్లు ఎప్పుడు తెరుస్తారో.. ఎప్పుడు మూస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఉత్తరాంధ్రలో జ్యూట్ మిల్లులపై ఆధారపడి వేలాది మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు. ఈ మిల్లులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవనం గడుపుతున్న వారి సంఖ్య దాదాపు లక్ష వరకు ఉంది. అయతే ఏటా జ్యూట్ మిల్లులు మూతపడటం పరిపాటిగా మారింది. ఆరు నెలలు సక్రమంగా పనిచేస్తే ఆ తరువాత ఆరు నెలలు మూతపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో యాజమాన్యాల మొండి వైఖరి లాకౌట్‌కు దారితీయగా, మరికొన్నిసార్లు కార్మికులు భీష్మించుకొని కూర్చోవడం వల్ల చిక్కుముడి వీడక జ్యూట్ మిల్లులు మూతపడుతున్నాయి. ఇటీవల విజయనగరం జిల్లాలోని రెండు జ్యూట్ మిల్లులు మూతపడగా, విశాఖ జిల్లా తగరపువలస జ్యూట్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులకు యాజమాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. పండగ ముందరనైనా పాత బకాయిలు చెల్లించాలని కార్మికులు పట్టుబడుతున్నారు. పండుగనాడు కూడా పస్తులేనా అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూతపడిన మిల్లులను తెరిపించేందుకు ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలూ ఉండటం లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కొత్త పరిశ్రమల మాట దేవుడెరుగు..ఉన్న పరిశ్రమలు మూతపడకుండా చూడాలని కార్మికులు కోరుతున్నారు.

తగరపువలస వద్దనున్న జ్యూట్ మిల్లు