బిజినెస్

గత లాభాలతోనే భారీ బోనస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/కొత్తగూడెం, అక్టోబర్ 7: సింగరేణి కాలరీస్ సంస్థకు నిరుడు 1,066.13 కోట్ల రూపాయల నికర లాభాలు వచ్చినందువల్ల కార్మికులకు 560 కోట్ల రూపాయల బోనస్‌ను ప్రకటించామని ఆ సంస్థ సిఎండి ఎన్ శ్రీ్ధర్ శుక్రవారం తెలిపారు. నిరుడు 21 శాతం బోనస్ చెల్లించామని, ఈ ఏడాది 23 శాతాన్ని చెల్లిస్తున్నామన్నారు. ఒక్కో కార్మికుడికి రూ. 54 వేల వరకు బోనస్ లభిస్తుందన్నారు. ఈ నెలాఖర్లోగా రెండు బోనస్‌లను చెల్లిస్తామని చెప్పారు. దాదాపు రూ. 245.21 కోట్లను బోనస్‌గా చెల్లించనున్నట్లు చెప్పారు. సింగరేణి కార్మికులకు గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో 23 శాతాని చెల్లించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించినది తెలిసిందే. దీంతో గురువారం రాత్రి నుండే ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా కార్మికుల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమవుతున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 21 శాతం ప్రకటించి ఆ సంవత్సరం సాధించిన లాభాల్లో రూ 102.90 కోట్లను పంపిణీ చేశారు. కాగా, ఈ ఏడాది 660 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.