బిజినెస్

100కుపైగా దేశాలకు బాలెనో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి తమ బాలెనో వాహనాన్ని 100కుపైగా దేశాల మార్కెట్లలోకి ఎగుమతి చేయాలని చూస్తోంది. కరీబియన్ దీవులతోపాటు దక్షిణాఫ్రికా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్య, ఆగ్నేయాసియా దేశాల్లో బాలెనోను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
భారతీయ మార్కెట్‌లో ఇప్పటికే లక్షకుపైగా అమ్మకాలను బాలెనో నమోదు చేసుకుంది. ప్రస్తుతం బాలెనో ఎగుమతులు ఫ్రాన్స్, డెన్మార్క్, జర్మనీ, గ్రీస్, హంగేరీ, ఐస్‌లాండ్, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, పోలాండ్, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, చిలీ, ఇజ్రాయెల్, ఇంగ్లాండ్, నేపాల్, భూటాన్, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా దేశాలకు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా 38,000 బాలెనో కార్లు ఈ దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఈ క్రమంలో రాబోయే నెలల్లో కరీబియన్ దీవులతోపాటు, ఉరుగ్వే, బొలీవియా, కోస్టారికా, హోండూరస్, పనామా, పెరు, దక్షిణాఫ్రికా, ఇండోనేషియాలకు మిడిల్ ఈస్ట్ దేశాలైన యుఎఇ, ఒమన్, కువైట్, లెబనాన్, ఖతార్, సౌదీ అరేబియాలకు బాలెనో ఎగుమతులు మొదలవుతాయని మారుతి సుజుకి ఇండియా అధికార ప్రతినిధి పిటిఐకి తెలిపారు.
కాగా, మారుతి సుజుకి రూపొందించిన కార్లలో జపాన్‌కు ఎగుమతి అయిన తొలి మోడల్ బాలెనో కావడం విశేషం. మారుతి సుజుకి మాతృ సంస్థ సుజుకి జపాన్‌కు చెందిన సంస్థన్నది తెలిసిందే. బాలెనో తయారీకి 1,060 కోట్ల రూపాయల పెట్టుబడులను మారుతి సుజుకి పెట్టింది. మనేసర్ ప్లాంట్‌లో తయారవుతున్న బాలెనో.. దేశీయ మార్కెట్‌కు నిరుడు అక్టోబర్ 26న పరిచయమైంది. మార్కెట్‌లో ప్రత్యర్థి సంస్థల కార్లకు మారుతి సుజుకి నుంచి బాలెనో గట్టిపోటీనిస్తుండటం, దాని ఆకృతి కూడా లగ్జరీ కారును తలపిం చేలా ఉండటం.. దేశ, విదేశాలకు బాలెనోను విస్తరింపజేస్తోంది.