బిజినెస్

కెటిపిపిలో విద్యుదుత్పత్తి బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, డిసెంబర్ 27: వరంగల్ జిల్లా చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ మొదటి దశ విద్యుత్ ప్లాంటులో సోమవారం (నేటి) నుండి వార్షిక మరమ్మతులు చేపట్ట్టనున్నారు. దీంతో ఆదివారం రాత్రి నుండి ప్లాంటులో విద్యుదుత్పత్తిని నిలిపి వేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, విద్యుత్ లోటు ఉండడంతో కెటిపిపి మొదటి దశను వార్షిక మరమ్మతులు చేయకుండా నడిపిస్తున్నారు. ఫలితంగా ప్రాజెక్ట్‌లో సాంకేతిక కారణాలు ఏర్పడుతూ అప్పుడప్పుడు ప్రాజెక్ట్ నిలిచిపోతోంది. ఈ నేపథ్యంలో కెటిపిపి 600 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ పూర్తయ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో కెటిపిపి మొదటి దశ విద్యుత్ ప్రాజెక్ట్‌కు వార్షిక మరమ్మతులు చేయాలని జెన్‌కో యాజమాన్యం నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కెటిపిపి మొదటి దశలో నేటి నుండి వార్షిక మరమ్మతులు చేపట్టాలని అధికారులు భావించడంతో ప్రాజెక్ట్‌లో సుమారు 15 రోజులపాటు విద్యుత్‌ను నిలిపి వేయనున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రే ప్రాజెక్ట్‌ను షట్‌డౌన్ చేస్తారని, అనంతరం ప్రాజెక్ట్‌లో వార్షిక మరమ్మతులు 15 రోజుల పాటు నిర్వహిస్తారని, అన్ని విభాగాలు పరిశీలించిన తర్వాత విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తామని అధికారులు పేర్కొన్నారు.
కెటిపిపి 600 మెగావాట్ల ప్లాంటులో సింక్రనైజేషన్....
మరోవైపు కెటిపిపి 600 మెగావాట్ల ప్లాంటులో సింక్రనైజేషన్ ప్రారంభించినట్లు కెటిపిపి అధికారులు తెలిపారు. 500 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్‌లో ఓవరాయలింగ్ పనులు చేపట్టడంతో 600 మెగావాట్ల ప్లాంట్ నుండి విద్యుదుత్పత్తిని అందించనున్నారు. అయితే విద్యుత్ ప్రాజెక్ట్‌లో సింగరేణి నుండి వచ్చిన బొగ్గును కనే్వయర్ బెల్ట్ ద్వారా ప్రాజెక్ట్‌లోకి పంపుతారు. ఈఎస్‌పిలో బొగ్గును చిన్న చిన్న ముక్కలుగా చేసి బాయిలర్‌లోకి చేరుస్తారు. అక్కడ వచ్చిన ఆవిరిని టర్బన్ ఆపరేటర్‌లోకి తీసుకెళ్తారు. ఈ ఆవిరితోనే జనరేటర్ నడవడం ప్రారంభమై విద్యుదుత్పత్తి జరుగుతుందన్నారు. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ప్రాజెక్ట్‌లోని స్విచ్‌యార్డుకు తరలిస్తారు. ప్రాజెక్ట్‌లో ఎంత విద్యుత్ ఉత్పత్తి అయిందో స్విచ్‌యార్డులోని సూచికలు తెలియచేస్తాయ. అక్కడ నుండి ప్రత్యేక లైన్ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. కాగా, ప్రస్తుతం కెటిపిపిలో లక్షా 80వేల బొగ్గు నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

కెటిపిపి మొదటి, రెండవ దశ విద్యుత్ ప్రాజెక్ట్‌లు