బిజినెస్

ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ ప్రైజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోమ్ (స్వీడన్), అక్టోబర్ 10: ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఈ ఏడాది ఇద్దరిని వరించింది. బ్రిటిష్-అమెరికా ఆర్థికవేత్త ఆలివర్ హార్ట్, ఫిన్లాండ్‌కు చెందిన బెంట్ హామ్‌స్ట్రోమ్ సోమవారం ఈ అవార్డును గెలుచుకున్నారు. ‘కాంట్రాక్టు థియరీ’లో చేసిన కృషికి గాను వీరిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నోబెల్ పురస్కార న్యాయ నిర్ణేతల మండలి ప్రకటించింది. కాంట్రాక్టు విధానంలో ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లకు పనితీరు ఆధారంగా వేతనాల చెల్లింపులు, మినహాయింపులు, బీమా రంగంలో సహ చెల్లింపులు, ప్రభుత్వ కార్యకలాపాల ప్రైవేటీకరణ వంటి విభిన్న అంశాలను సమగ్రమైన రీతిలో విశే్లషించేందుకు ఉపకరించే కాంట్రాక్టు సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసినందుకు వీరిని నోబెల్ పురస్కారానికి ఎంపిక చేశామని న్యాయ నిర్ణేతల మండలి వివరించింది. నిజ జీవితానికి, అలాగే సంస్థలకు సంబంధించిన కాంట్రాక్టుల గురించి లోతుగా అర్ధం చేసుకునేందుకు ఉపకరించే ఈ సిద్ధాంతం ఎంతో విలువైనదని న్యాయ నిర్ణేతల మండలి పేర్కొంది. ఈ అవార్డు కింద బహూకరించే 80 లక్షల నార్‌లను (8.26 లక్షల యూరోలు లేదా 9.24 లక్షల అమెరికన్ డాలర్లు) వీరిద్దరూ పంచుకోనున్నారు.
1948లో జన్మించిన ఆలివర్ హార్ట్ ప్రస్తుతం అమెరికా హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, బెంట్ హామ్‌స్ట్రోమ్ ఎంఐటి (మసాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఎకనమిక్స్, మేనేజ్‌మెంట్ విభాగానికి ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.