బిజినెస్

పసిడి, వెండిపై పెట్టుబడులు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: స్టాక్స్‌పై పెట్టుబడుల కంటే బంగారం, వెండిపై పెట్టిన పెట్టుబడులే మదుపరులకు అధిక లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా పసిడి, వెండి పెట్టుబడులు మదుపరులకు 28 శాతం వరకు లాభాలను తెస్తే, స్టాక్స్‌పై పెట్టిన పెట్టుబడుల లాభాలు 8 శాతానికే పరిమితమయ్యాయి మరి. పుత్తడి ధర ఈ ఏడాది ఆరంభం నుంచి అక్టోబర్ 10 వరకు గమనిస్తే 19.77 శాతం పెరిగింది.
ఇదే సమయంలో వెండి ధర 28.37 శాతం ఎగిసింది. అయితే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ వృద్ధి మాత్రం 7.52 శాతం వద్దే నిలిచింది. గత నెల సెప్టెంబర్ 8న సెనె్సక్స్ 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకుతూ 29,077.28 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇకపోతే 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర ఈ ఏడాది జనవరి 1న 25,390 రూపాయలతో ప్రారంభమైతే, ప్రస్తుతం 30,150 రూపాయల వద్ద ఉంది. అంటే 4,760 రూపాయలు పెరిగింది.
అలాగే కిలో వెండి ధర నాడు 33,300 రూపాయలుగా ఉంటే, నేడు 42,590 రూపాయల వద్ద కదలాడుతోంది. అంటే 9,290 రూపాయలు ఎగిసింది.
ఇక స్టాక్స్ విషయానికొస్తే సెనె్సక్స్ జనవరి 1న 25,960.03 పాయింట్లతో మొదలవగా, ప్రస్తుతం 28,082.34 పాయింట్ల వద్ద ఉంది. 2,122.31 పాయింట్లు పెరిగింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7,896.25 పాయింట్లతో మొదలై 812.55 పాయింట్లు అందుకుని 8,708.80 వద్ద నిలిచింది. దీంతో అటు సెనె్సక్స్‌లోగానీ, ఇటు నిఫ్టీలోగానీ పెట్టిన పెట్టుబడుల కంటే, బంగారం, వెండిపై పెట్టిన పెట్టుబడుల ద్వారానే ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఎక్కువ మొత్తంలో మదుపరులు లాభపడ్డారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, చైనా ఆర్థిక వ్యవస్థలపై నెలకొన్న ఆందోళనలు ఈ ఏడాది ఆరంభంలో దేశీయ స్టాక్ మార్కెట్లను తీవ్ర ఒడిదుడుకులకు లోనుచేశాయి. దీంతో మెజారిటీ షేర్ల విలువలు పడిపోయాయి. ఫలితంగా మదుపరులకు నష్టాలే మిగిలాయి. దీంతో పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా మదుపరులకు బంగారం, వెండి కనిపించడంతో సహజంగానే వాటికి డిమాండ్ పెరిగి, ధరలు కూడా పెరిగాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వార్షిక సాధారణ బడ్జెట్ అనంతరం మళ్లీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెట్టాయి. దీంతో ఆరంభం (జనవరి-మార్చి)లో వచ్చిన నష్టాలు కనుమరుగై, కొంతవరకు లాభాలు నమోదయ్యాయి.
ఇదిలావుంటే బంగారంపై పెట్టుబడులు ఎప్పుడూ లాభదాయకంగానే ఉంటున్నాయని, మదుపరులకు పసిడిపై పెట్టుబడుల వల్ల నష్టాలు వచ్చిన సందర్భాలు చాలాచాలా తక్కువని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గడచిన 15 సంవత్సరాల్లో 12 ఏళ్లు బంగారంపై పెట్టుబడులతో మదుపరులు లాభాలనే పొందారని గుర్తుచేస్తున్నారు. అయితే నిరుడు స్టాక్స్‌తోపాటు బంగారంపై పెట్టిన పెట్టుబడులు కూడా మదుపరులకు నిరాశనే కలిగించాయన్నారు. 2015 మార్చి 4న సెనె్సక్స్ 30,024.74 పాయంట్ల ఆల్‌టైమ్ హైని తాకినప్పటికీ, ఆ ఏడాదిలో 1,942.4 పాయంట్లు నష్టపోయంది.
2014లో మాత్రం బంగారం, వెండిపై పెట్టిన పెట్టుబడుల కంటే కూడా స్టాక్స్‌పై పెట్టిన పెట్టుబడులు మదుపరులకు భారీగా లాభాలను తెచ్చిపెట్టాయి. ఇలా లాభాలు రావడం అది వరుసగా మూడో ఏడాది కావడం గమనార్హం. కాగా, స్టాక్స్‌తో పోల్చితే బంగారం, వెండి ధరలు పెద్దగా ఆటుపోట్లకు గురికావని, అందుకే బంగారం, వెండిపై పెట్టుబ డులు మదుపరులకు శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు. దేశ, విదేశీ పరిస్థితుల ప్రభావం స్టాక్ మార్కెట్లపై త్వరగా చూపుతుందని, బులియన్ మార్కెట్‌పై ఉండబోదంటున్నారు. నిజానికి మార్కెట్‌లో అన్ని రంగాల కంటే కూడా పసిడి, వెండి మార్కెట్ లో నిలకడ కాస్త ఎక్కువేనని నిపుణు లు పేర్కొంటున్నారు.