బిజినెస్

ఇన్ఫోసిస్ లాభం రూ.3,606 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, అక్టోబర్ 14: దేశంలోనే రెండవ అతిపెద్ద ఐటి సంస్థ అయిన ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 6.1 శాతం, నికర రాబడి 3 శాతం పెరిగినప్పటికీ ఏడాది అమ్మకాల వృద్ధి అంచనాలను మరోసారి తగ్గించిన నేపథ్యంలో శుక్రవారం షేరు మార్కెట్లో ఆ కంపెనీ షేరు 2 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 10.7 శాతం పెరిగి రూ. 17,310కోట్లకు చేరుకోగా, ఏకీకృత నికర లాభం గత ఏడాది ఇదే సమయంలో ఉండిన రూ.3,398 కోట్లనుంచి రూ.3,605 కోట్లకు పెరిగింది. బిఎస్‌ఇకి సమర్పించిన వివరాల్లో కంపెనీ ఈ విషయం తెలియజేసింది. అయితే డాలర్ల లెక్కల్లో వచ్చే ఏడాది మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరం కంపెనీ అమ్మకాలు 7.5-8.5 శాతం పెరగవచ్చని ఆ కంపెనీ అంచనా వేసింది. అయితే గత జూలై నెలలో అంచనా వేసిన 10 శాతంకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ ఈ వృద్ధి 11.5 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. ఐటి పరిశ్రమల సంఘం నాస్‌కామ్ అంచనా వేసిన ఎగుమతుల అంచనా 10-12 శాతంకన్నా ఇది చాలా తక్కువగా ఉండడం విశేషం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతుండడం, ఐరోపా సమాజంనుంచి బ్రిటన్ నిష్క్రమణ ఫలితంగా తలెత్తే పరిణామాల కారణంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల రంగాల్లో వృద్ధి మందగించడంతో కంపెనీలు ఐటి రంగంపై తమ బడ్జెట్‌లను తగ్గించుకుంటున్నాయి. ‘దేశం వెలుపల నెలకొన్న అనిశ్చిత పరిస్థితిని అదిగమించడానికి ప్రయత్నిస్తాం. ఐటి సేవలకు మరింత పదును పెడతాం. గడచిన ఆరు నెలల్లో కంపెనీ ప్రదర్శన ఆశించిన మేర ప్రభావం చూపించలేదు. ఈ ఏడాది తొలి అర్ధ్భాగంలో కంపెనీ పని తీరును, సమీప భవిష్యత్తులో అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని మా రెవిన్యూ అంచనాలను సవరిస్తున్నాం. అయితే ఆదాయ మార్గాలను పునః సమీక్షించుకుంటాం’ అని ఇన్ఫోసిస్ సిఈఓ విశాల్ సిక్కా తెలిపారు. అయితే 2020 నాటికి 20 బిలియన్ డాలర్ల రెవిన్యూను సాధించిన కంపెనీగా ఎదగాలన్న ఆకాంక్షకు కంపెనీ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలు తమ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని, మంచి ఫలితాలనే సాధించినప్పటికీ కంపెనీ తన అంచనాలను తగ్గించుకోవడం గమనార్హమని, ఈ తగ్గింపు తాము ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా ఉన్నదని సిస్టమాటిక్స్ షేర్స్ అండ్ స్టాక్స్ కంపెనీ రిసెర్చ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ జైన్ అన్నారు.