బిజినెస్

భారత దేశమే ప్రపంచానికి ఆశాదీపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ప్రస్తుతమున్న సంక్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లో ప్రపంచానికి ‘ఆశాదీపం’ భారత దేశమేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ముఖ్య ఆర్థికవేత్త వౌరిస్ అబ్స్‌ఫెల్డ్ కితాబిచ్చారు. అయితే ఆర్థికంగా భారత్ ఎంత పురోగతి సాధించినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పేరుకుపోతున్న నిరర్థక ఆస్తులు ఇప్పటికీ పెను సవాలుగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం బ్రూకింగ్స్ ఇండియా నిర్వహించిన ఒక కార్యక్రమంలో అబ్స్‌ఫెల్డ్ ప్రసంగిస్తూ, సంక్లిష్ట ఆర్థిక పరిస్థితుల వలన ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి కుంటుబడినప్పటికీ భారత్‌తో పాటు చైనా కూడా వృద్ధి బాటలో పయనిస్తోందని, కానీ ద్రవ్యోల్బణంతో పాటు కరెంటు ఖాతా లోటు గణనీయంగా తగ్గడంతో భారత్ పరిస్థితి చైనా కంటే ఎంతో మెరుగ్గా ఉందని అన్నారు. అయితే ఆర్థికంగా భారత్ ఎంతో పురోగతి సాధించినప్పటికీ వ్యవస్థాగతమైన ఇబ్బందులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతుండటం భారత్‌కు పెను సవాలును విసురుతోందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) భారత్‌లో 7.6 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని ఐఎంఎఫ్ గత నెలలో అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే వౌలిక వసతులు, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలకు మరిన్ని వనరులను సమకూర్చేందుకు పన్నుల వ్యవస్థలో సంస్కరణలను కొనసాగించడంతో పాటు పలు రకాల రాయితీలను రద్దు చేయాలని ప్రభుత్వానికి ఐఎంఎఫ్ సూచించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 5.43 శాతం (రూ.2.67 లక్షల కోట్లు)గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు 2015-16లో 9.32 శాతానికి (రూ.4.76 లక్షల కోట్లకు) పెరిగాయి. దీంతో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలతో సతమతమవుతున్నాయి.

‘పౌల్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి’

బిక్కవోలు, అక్టోబర్ 14: సామాన్యునికి పౌష్టికాహారమైన గుడ్డు, కోడిమాంసం అతి చౌకగా అందిస్తున్న పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి ఏపి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అనపర్తి ప్రాంతీయ కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ గుడ్డు దినోత్సవం శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో ఘనంగా నిర్వహించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, రాష్ట్ర పశు సంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్‌సింగ్, తూ.గో. జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, నెక్ జిల్లా ఛైర్మన్ పడాల సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా పౌల్ట్రీ రంగ పితామహుడు డాక్టర్ బివిరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోడి గుడ్డుతో వివిధ రకాల వంటకాలు అనే పుస్తకాన్ని మంత్రి సుజాత ఆవిష్కరించారు. ఈసందర్భంగా అనపర్తి జిబిఆర్ కళాశాల నుంచి 2కె రన్ నిర్వహించారు.

బివి రావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న చినరాజప్ప