బిజినెస్

కాకినాడ-ఉప్పాడ మధ్య జియో ట్యూబ్ గోడ పునరుద్ధరణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 27: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ-ఉప్పాడ తీర మార్గంలో వరుస తుపాన్లకు శిథిలమైన జియో ట్యూబ్ గోడ పునరుద్ధరణకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. జియో ట్యూబ్ టెక్నాలజీతో మళ్ళీ ఈ గోడ పునరుద్ధరణ కోసం 13.35 కోట్ల రూపాయల అంచనాతో సంబంధిత అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్‌లో యథావిధిగా సరకు, ప్రజా రవాణా జరగాలంటే జియో ట్యూబ్ టెక్నాలజీతో గోడను పునర్నిర్మించాల్సి ఉందని ఇప్పటికే ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. గడచిన కొనే్నళ్ళుగా వరుసగా సంభవించిన జల్, నీలం, లైలా, పైలిన్, హుదూద్ తుపాన్ల ధాటికి ఈ జియో ట్యూబ్ గోడ చాలా వరకు శిథిలావస్థకు చేరింది. ముఖ్యంగా ఇటీవలి హుదూద్ తుపాన్ కారణంగా తీర మార్గానికి తీవ్ర నష్టం వాటిల్లింది. రహదారి సముద్రపు కోతకు గురికావడం, వంతెనలు శిథిలం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సముద్రపు అలలను అడ్డుకునే జియో ట్యూబ్ గోడ బలహీనంగా మారడంతో రోడ్లు కొట్టుకుపోతున్నాయ. దీంతో తుపాన్ల సమయంలో ఈ రహదారిలో రాకపోకలను నిషేధిస్తుండటంవల్ల ఆక్వా, పారిశ్రామిక, వ్యాపార వర్గాలకు రవాణా పరంగా ఇబ్బందులెదురవుతున్నాయి. ముఖ్యంగా సముద్రపు కోత కారణంగా మత్స్యకారుల కార్యకలాపాలకు భంగం వాటిల్లుతోంది. ఈ మార్గం వెంబడి ఎండు చేపలను తయారు చేసుకునే మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఉప్పాడ మార్గాన్ని సముద్రపు కోత చాలా కాలంగా పట్టి పీడిస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధుల విన్నపం మేరకు 2008లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్‌గా చెన్నైకి చెందిన ఓ నిర్మాణ కంపెనీకి గోడ నిర్మాణ బాధ్యతలను అప్పగించింది. సముద్రపు కోత నివారణకు జియో ట్యూబ్ టెక్నాలజీతో గోడ నిర్మాణాన్ని ప్రారంభించారు. 1,463 మీటర్ల పొడవున గార్‌వేర్ వాల్‌రోప్స్ సహాయంతో పెద్ద పెద్ద బండరాళ్ళను తీరం వెంబడి ఉంచి గోడను నిర్మించారు. 2008లో ఈ పనులు ప్రారంభించి 2011కు పూర్తిచేశారు. తీరం వెంబడి ఏర్పాటుచేసిన ఈ జియో ట్యూబ్ టెక్నాలజీతో చాలావరకు బీచ్‌రోడ్‌కు రక్షణ లభించింది. అయితే వరుస తుపాన్ల కారణంగా ఈ మార్గంలో సుమారు 35 ప్రాంతాల్లో గోడ శిథిలావస్థకు చేరింది. పోటు సమయాల్లో సముద్రపు అలల కారణంగా రహదారి మరింత శిథిలావస్థకు చేరుకుంటోంది. ఫలితంగా ఈ మార్గం వెంబడి వాణిజ్య, వ్యాపారంతోపాటు సాధారణ కార్యకలాపాలకు విఘాతం కలుగుతోంది. ఈ క్రమంలో అధికారులు ప్రతిపాదించిన అంచనాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభించనున్నట్టు అధికార వర్గాలు తెలియజేశాయి.

సముద్ర తీరం వెంట జియో ట్యూబ్ పరిజ్ఞానంతో నిర్మించిన గోడలు, హుదూద్ తుపాన్ ధాటికి దెబ్బతిన్న రహదారి