బిజినెస్

ఆటుపోట్లకు అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ముగుస్తున్న క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడిదుడుకులకు గురికావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘గురువారం (డిసెంబర్ 31)తో ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ముగియనుంది. దీంతో మార్కెట్లలో ఒడిదుడుకులకు ఆస్కా రం కనిపిస్తోంది.’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. ఇకపోతే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, విదేశీ మదుపరుల పెట్టుబడుల తీరు కూడా మార్కెట్ కదలికలను ప్రభావితం చేస్తుందని సింఘానియా పేర్కొన్నారు. కాగా, డిసెంబర్ నెలకుగాను జనవరి 1న (శుక్రవారం) ఆటోరంగ సంస్థలు ప్రకటించే అమ్మకాల గణాంకాలు కూడా కీలకమేనని నిపుణులు అంటున్నారు. ‘స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్ల పోకడ ఈ వారం దేశీయ మార్కెట్లను నడిపించగలవు.’ అని క్యాపిటల్‌వయా గ్లోబ ల్ రిసెర్చ్ లిమిటెడ్ రిసెర్చ్ డైరెక్టర్ వివేక్ గుప్తా అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే ప్రభుత్వ సంస్కరణలపై ఆశాభావంతో విదేశీ పోర్ట్ఫోలియో మదుపరు(ఎఫ్‌పిఐ)లు వచ్చే ఏడాది భారీ స్థాయిలో పెట్టుబడులను దేశీయ మార్కెట్లలోకి తీసుకువస్తారన్న ఆశాభావాన్ని జియోజిత్ బిఎన్‌పి పరిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఫండమెంటల్ రిసెర్చ్ అధిపతి వినోద్ నాయర్ వ్యక్తం చేశారు. గత వారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసినది తెలిసిందే. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 319.49 పాయింట్లు పుంజుకుని 25,838.71 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 99.10 పాయింట్లు అందుకుని 7,861.05 వద్ద స్థిరపడింది. అంతకుముందు వారమూ సెనె్సక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడగా, ఈ రెండు వారా ల్లో సెనె్సక్స్ 794.28 పాయింట్లు, నిఫ్టీ 250.60 పాయింట్లు కోలుకున్నాయి.