బిజినెస్

రూ. 70 వేల కోట్ల ఉత్పత్తి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 19: విశాలమైన కోస్తా తీరం, అపారమైన మత్స్య సంపద, కావాల్సినన్ని మానవ వనరులు.. వెరసి.. సముద్ర ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌గా కొనసాగుతోంది. ఏపి కన్నా తీర ప్రాంతం అధికంగా ఉన్న రాష్ట్రాలున్నప్పటికీ చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రా అగ్రస్థానంలో కొనసాగడానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలే కారణమని చెప్పాలి. ఉత్పత్తిలోనే కాదు ఉపాధి కల్పనలోనూ మన యువతకు ఈ రంగం భారీ అవకాశాలు కల్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షలకుపైగా కుటుంబాలు మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. రానున్న సంవత్సరాల్లో మత్స్య పరిశ్రమను భారీ స్థాయిలో అభివృద్ధి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఇందుకోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. కేంద్రంతో కలిసి రాష్ట్రానికి విస్తృత ప్రయోజనాలు సమకూరేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఏటికేడాది 20 నుంచి 30 శాతానికిపైగా వృద్ధి సాధిస్తున్న మత్స్య పరిశ్రమ కారణంగా రైతులు లాభపడుతుండటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం వచ్చి పడుతోంది.
వంద శాతం ఉత్పత్తి లక్ష్యం
వ్యవసాయ పంటలు మాత్రమే రైతుల అవసరాలను తీర్చలేకపోతుండటంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది చంద్రబాబు సర్కారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే సముద్ర ఉత్పత్తులను భారీగా పెంచాలని నిర్ణయించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రంలో సముద్ర ఉత్పత్తుల విలువ దాదాపు 30 వేల కోట్ల రూపాయలుగా ఉంది.
అయతే 2019-20 నాటికి 70 వేల కోట్ల రూపాయలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా తొలి రెండేళ్లలోనే మన సముద్ర ఉత్పత్తుల విలువ దాదాపు 40 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. వచ్చే మూడేళ్లలో అనుకున్న లక్ష్యాలు పూర్తి చేయడానికి ప్రభుత్వం విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం మత్స్య పరిశ్రమలో నిపుణుల సలహాలు తీసుకుంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సముద్ర ఉత్పత్తులు 25 లక్షల టన్నులకుపైగా ఉన్నాయ. వీటి అమ్మకాల్లో 16 వేల కోట్ల రూపాయలు విదేశీ మారకద్రవ్యం రూపంలో వస్తోంది. సముద్ర ఉత్పత్తుల్లో ఉన్న వృద్ధి శాతాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ కేటాయింపులు కూడా భారీగా పెంచింది. 2015-16లో 187.19 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం.. ప్రస్తుత 2016-17కు 339 కోట్ల రూపాయలకు పెంచింది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతికి భారీ అవకాశాలుండటంతోపాటు ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన మత్స్య విధానాన్ని ప్రకటించింది. రైతులకు నాణ్యమైన చేప పిల్లలు అందించడం కోసం 20 కోట్ల రూపాయలతో గుంటూరు జిల్లా బాపట్లలో భారీ హేచరీ నిర్మించాలని నిర్ణయించింది. అలాగే అసైన్డ్ భూముల్లో కూడా చేపలు, రొయ్యల చెరువులు ఏర్పాటు చేసుకోవచ్చని ప్రకటించింది.
ఎనె్నన్నో ప్రోత్సాహకాలు
మత్స్యకారులు, సముద్ర ఉత్పత్తుల పెంపకందారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలిస్తోంది. వేట నిషేధ కాలంలో మూడు నెలల పాటు జాలర్లకు ఇచ్చే జీవనభృతి 2 వేల నుంచి 4 వేల రూపాయలకు పెంచింది. ఈ మూడు నెలల కాలంలో కుటుంబానికి 30 కేజీల బియ్యాన్ని కూడా ప్రభుత్వమే అందజేస్తోంది. ఈ పథకం ద్వారా 60,500 కుటుంబాలకు ప్రయోజనం కల్పిస్తోంది. ఇందిరమ్మ పథకం ఇళ్లు కట్టిస్తోంది. 20 రూపాయల ప్రీమియంతో గ్రూప్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ స్కీం అమలు చేస్తోంది. ఈ పథకం ప్రకారం మరణించిన జాలరికి రెండు లక్షలు, వికలాంగుడైతే లక్ష రూపాయలు అందిస్తోంది. ఇది కాకుండా చనిపోయినా, జాడ తెలియకుండా పోయిన మత్స్యకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో లక్ష రూపాయలు ఎక్స్‌గ్రేషియా అందజేస్తోంది.
చేపల్ని వెంటనే అమ్ముకోలేని పరిస్థితుల్లో వాటిని నిల్వ ఉంచుకోడానికి ఐస్ బాక్సుల్ని రాయితీ ధరలకు ప్రభుత్వం కల్పిస్తోంది. మత్స్య మిత్ర గ్రూప్ పేరుతో మత్స్యకార కుటుంబాల్లోని మహిళలు చేపలు అమ్ముకోడానికి, మార్కెటింగ్ కోసం లక్ష రూపాయలను రివాల్వింగ్ ఫండ్ రూపంలో కూడా ప్రభుత్వం ఇస్తోంది. ఆధునిక పద్ధతుల్లో చేపల వేట సాగించడం ద్వారా భారీ స్థాయిలో ఉత్పత్తి సాధించడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూ రుస్తోంది. దీంతోపాటు మర పడవలు, మోటార్లు, వలలను కూడా సబ్సిడీ ధరలకే ప్రభుత్వం అందజేస్తోంది.