బిజినెస్

భాగస్వామ్య సదస్సుకు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 30: జనవరి 10 నుంచి 12వ తేదీ వరకూ విశాఖలో నిర్వహించనున్న సిఐఐ (్భరతీయ పరిశ్రమల సమాఖ్య) భాగస్వామ్య సదస్సుకు చకచక భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయని పరిశ్రమల శాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. బుధవారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ఏ విధంగా జరగాలో ఈ సదస్సులో ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. అలాగే ప్రాధాన్యతా రంగాల్లో ఏ రకమైన అవకాశాలు ఉన్నాయి అనే అంశాలపైనా చర్చ జరుగుతుందని కార్తికేయ మిశ్రా వివరించారు. ఉత్పాదక రంగంలో వ్యూహాలు, పర్యాటక రంగం, విద్య, పరిశ్రమలు, నిర్మాణ రంగంలో డిమాండ్‌కు తగ్గట్టుగా సౌరశక్తి ఉత్పాదన, పారిశ్రామిక రంగంలో సవాళ్లపై చర్చిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ అంశాలకు సంబంధించి 150 అవగాహన ఒప్పందాలు (ఎంఓయు) కుదుర్చుకోనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ఏ రకమైన అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి, ఉపాధి కల్పన ఏ మేరకు చేపట్టడానికి అవకాశం ఉందన్న విషయాలపై ప్రధానంగా చర్చ ఉంటుందన్నారు. ఈ సదస్సులో కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారని కార్తికేయ మిశ్రా తెలియజేశారు. ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక, వ్యాపార సంస్థలు మోర్, గోద్రేజ్, వాల్ మార్ట్, క్రోమా, ట్రెండ్‌కాన్, నోవాటెల్, టాటా పాల్గొంటున్నాయని ఆయన వివరించారు. అంతేగాక ఈ సదస్సుకు 29 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. 10వ తేదీన లాంఛనంగా ఈ సదస్సు ప్రారంభమవుతుందని, 11న నాలుగు ప్లీనరీ సమావేశాలు, 12న రెండు ప్లీనరీ సమావేశాలు ఉంటాయన్నారు.
కాగా, ప్రారంభ సదస్సులో ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి) ప్రతినిధి టెరీసా హో ప్రసంగిస్తారని కార్తికేయ చెప్పారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (విసిఐసి)తోపాటు, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (సిబిఐసి)లను ఆర్థిక కారిడార్లుగా అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలపై వివరిస్తారన్నారు. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో విసిఐసికి 600 మిలియన్ డాలర్ల నిధులు మంజూరు చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంగీకరించిందన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు.