బిజినెస్

సుబాబుల్ రైతుకు గిట్టుబాటు కాని ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 23: ఇంటర్నెట్ యాప్‌లు, కంప్యూటర్ల వినియోగం అనూహ్యంగా పెరిగినప్పటికీ మార్కెట్‌లో తెల్లకాగితం ధర సామాన్య, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో లేకుండా పోతున్నది. అయినప్పటికీ ఆరుగాలం శ్రమిస్తున్న సుబాబుల్ రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. కాగితం తయారీకి వినియోగించే సుబాబుల్ రైతులు నష్టాల నావను ఈదుతున్నారు. ప్రధానంగా గత కొనే్నళ్లుగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సమక్షంలోనే పేపర్ కంపెనీలు రైతులతో ధరలను నిర్ణయించుకుంటూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నప్పటికీ కార్యాచరణలో ఎక్కడా అమలు కావటం లేదు. పైగా మార్కెట్ యార్డు కనుసన్నల్లో డంపింగ్ యార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే సంబంధిత రైతుకు 24 గంటల్లో ఆన్‌లైన్ ద్వారా వారివారి ఖాతాల్లోకి సొమ్ము జమకావాల్సి ఉండగా, నెల రోజుల వరకు జమ కావటం లేదు. ఇందుకోసం ఆయా కంపెనీల చుట్టూ రైతులు కాళ్లరిగేలా తిరగాల్సి వస్తున్నది. ఇక చెక్ బౌన్స్ అయితే రైతుల పరిస్థితి చెప్పనలవికాదు. పేపర్ కంపెనీలు ఏ ఏడాదికాయేడాది పేపర్ ధరను పెంచుతూ వందల కోట్ల లాభాలను ఆర్జిస్తూ మరోవైపు రైతులకు మాత్రం గిట్టుబాటు ధర చెల్లించడానికి కుంటి సాకులు చెబుతున్నాయి. నేడు జాతీయంగానేగాక అంతర్జాతీయంగానూ కూడా రోజురోజుకి పేపర్ ధర పెరుగుతున్నా ప్రభుత్వ నియంత్రణ లేక రైతులు నిత్యం దోపిడీకి గురవుతూనే ఉన్నారు. టన్ను న్యూస్ ప్రింట్ తయారీకి నాలుగు టన్నుల కలప, రెండు టన్నుల బొగ్గు, కరెంట్ ఇతర ఛార్జీలన్నీ కలిపి దానిపై 45 వేల రూపాయలు ఖర్చు అవుతోంది. బహిరంగ మార్కెట్లో టన్ను న్యూస్ పేపరు ధర 70 వేల రూపాయలపైనే పలుకుతోంది. అలాగే ఫైన్ క్వాలిటీ పేపర్ ధర 90 వేల రూపాయల వరకు ఉంది. ఈ విధంగా పేపర్ కంపెనీలు వేల కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తూ.. టన్ను సుబాబుల్‌కు అదనంగా కనీసం 200 నుంచి 300 రూపాయల ధర పెంచడానికి వెనుకాడుతున్నాయి. రెండేళ్ల క్రితమే ప్రభుత్వ సమక్షంలో కంపెనీలు టన్నుకు 4,700 రూపాయల చెల్లింపునకు ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ 4,300 రూపాయలు మించి ధర లభించడం లేదు.
ఇదిలా ఉండగా ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును రైతు సంఘాల ప్రతినిధులు కలిసి ప్రధానంగా గిట్టుబాటు ధరపై తమ వాదనలు వినిపించినా.. కంపెనీలపై ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. పేపర్ కంపెనీలు మోనోపోలీగా వ్యవహరించటంతో ఐటిసి సంస్థ ప్రతి యేటా దాదాపు 900 కోట్ల రూపాయలపైనే లాభాలను ఆర్జిస్తున్నదని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు.