బిజినెస్

ఆర్థిక ఫలితాలపై ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రముఖ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలపై ఆధారపడి నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎన్‌టిపిసి, ఐటిసి, మారుతి సుజుకి, అదానీ పవర్, యాక్సిస్ బ్యాంక్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ క్యాపిటల్, ఏషియన్ పేయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌డిఎఫ్‌సి, హీరో మోటోకార్ప్, హిందుస్థాన్ యునిలివర్, ఐఒసి, ఒఎన్‌జిసి తదితర సంస్థలు ఈ వారం తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ క్రమంలో మదుపరులు తమ పెట్టుబడులపై ఈ సంస్థల ఆర్థిక ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని మెజారిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా ఎప్పట్లాగే భారతీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని మార్కెట్ వర్గాలు విశే్లషిస్తున్నాయి. అయితే ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగిసిపోతుండటంతో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే వీలుందని కూడా నిపుణులు అంటున్నారు. ‘ఈ వారం కూడా పలు ప్రధాన సంస్థలు తమ జూలై-సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి. దీంతో మార్కెట్లు వాటి ఆధారంగా నడుస్తాయని చెప్పవచ్చు.’ అని ఆమ్రపాలి ఆద్య ట్రేడింగ్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, రిసెర్చ్ అధిపతి అభ్నిశ్ కుమార్ సుధాంశు అన్నారు. ఇక ఈ వారం దేశీయంగా చెప్పుకోదగ్గ అంశాలేమీ లేకపోవడంతో మదుపరుల చూపు అంతర్జాతీయంగా పరిణామాలపై సహజంగానే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్.. భారత స్టాక్ మార్కెట్లతోపాటు ప్రపంచ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నగా భావించే అమెరికాకు అధ్యక్షుడి ఎన్నిక ప్రపంచ దేశాలపై తప్పక ఉంటుందని సుధాంశు అన్నారు. కాగా, గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 403.58 పాయింట్లు పెరిగితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 109.65 పాయింట్లు లాభపడినది తెలిసిందే.