బిజినెస్

ఫార్మా అభివృద్ధి, పరిశోధనలపై అంతర్జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: దక్షిణాసియా ఔషధ రంగం అభివృద్ధి, పరిశోధనలపై వచ్చే నెల 17 నుంచి 23 వరకు ముంబయిలో అంతర్జాతీయ సదస్సు జరుగుతుందని యుబిఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ ముద్రాస్, ఫార్మా ఎక్సిల్ అదనపు ఇడి రవి ఉదయ్ భాస్కర్ తెలిపారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఫార్మా రంగంలో వ్యాపారం, విజ్ఞానం, నాయకత్వం, మహిళా శాస్తవ్రేత్తలు, పరిశోధనలు అనే అంశాలపై వారం రోజుల పాటు విస్తృతమైన చర్చలు సదస్సులో జరుగుతాయన్నారు. ఫార్మా వీక్ పేరుతో ఈ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వంద దేశాల నుంచి 1,300 కంపెనీల పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని చెప్పారు. ప్రపంచ ఫార్మా మార్కెట్‌లో భారత్ ఉత్పత్తుల వాటా 10 శాతం, విలువలో 24 శాతంగా ఉందని, 2020 నాటికి ఫార్మా పరిశ్రమ టర్నోవర్ 55 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. అంతర్జాతీయ ఎగుమతుల్లో జనరిక్ ఔషధాల వాటా 20 శాతం ఉంటుందన్నారు.

ఫార్మా వీక్ పబ్లికేషన్ ఆవిష్కరణ దృశ్యం

సింగరేణి ఉద్యోగులకు దీపావళి బోనస్

రూ. 54 వేల చొప్పున నేడు పంపిణీ

కొత్తగూడెం, అక్టోబర్ 25: సింగరేణి ఉద్యోగులకు బుధవారం దీపావళి బోనస్‌లను వారి బ్యాంకు ఖాతాల ద్వారా యాజమాన్యం చెల్లించనుంది. ఈ మేరకు సంస్థ జనరల్ మేనేజర్ (పర్సనల్) ఆర్‌సి, ఐఆర్‌అండ్‌పిఎంఎ ఆనందరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంస్థ సాధించిన లాభాలలో వాటా రూపేణ రూ. 245.21 కోట్ల రూపాయలు ఈ నెల 7న యాజమాన్యం చెల్లించింది. అదేవిధంగా దసరా పండుగ సందర్భంగా పండుగ అడ్వాన్సుగా ఒక్కో కార్మికునికి రూ. 18 వేల చొప్పున చెల్లించారు. తాజాగా దీపావళి బోనస్ రూపేణ రూ. 54 వేలు సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఎన్‌సిడబ్ల్యూఎ (నాన్ ఎగ్జిక్యూటివ్స్) ఉద్యోగులందరికీ చెల్లించడానికి సర్క్యూలర్ జారీ అయింది.