బిజినెస్

జల విద్యుత్‌లో ఎపి జెన్‌కోకు అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (జెన్కో)కు జల విద్యుత్ వినియోగంలో ప్రతిభ కనబర్చినందుకుగాను అవార్డు లభించింది. న్యూఢిల్లీలో ఈ నెల 29న జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా ఈ అవార్డును ఎపి జెన్కో ఎండి కె విజయానంద్, డైరక్టర్ బి శామ్యూల్ అందుకున్నారు. జల విద్యుత్ ఉత్పాదన రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 1,762 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కలిగి అగ్రస్థానంలో ఉంది. థర్మల్, హైడల్ విద్యుత్ ఉత్పాదనలో ఎపి జెన్కో ఇప్పటికే చాలా అవార్డులు అందుకుందని ఎపి స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎ చంద్రశేఖర రెడ్డి తెలిపారు.

ఉమాభారతి నుంచి అవార్డు అందుకుంటున్న ఎపి జెన్కో హైడల్ డైరెక్టర్ బి శామ్యూల్

ఎస్సార్ ఆయిల్ డీలిస్టింగ్ పూర్తి

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ఎస్సార్ ఆయిల్ లిమిటెడ్.. స్థానిక స్టాక్ ఎక్స్‌చేంజ్‌ల నుంచి డీలిస్టింగ్ (వైదొలిగే) ప్రక్రియను పూర్తి చేసింది. ఈ మేరకు బుధవారం ప్రకటించింది. ఈ ప్రక్రియలో భాగంగా భాగస్వాములకు 3,745 కోట్ల రూపాయలను ఎస్సార్ ఆయిల్ లిమిటెడ్ చెల్లించింది. భారతీయ కార్పొరేట్ చరిత్రలోనే ఇలాంటి ప్రక్రియల్లో ఇదే అతి పెద్దది. ఎస్సార్ ఆయిల్ లిమిటెడ్ మార్కెట్ విలువ 38,000 కోట్ల రూపాయలుగా ఉంది. 1995లో ఐపిఒ ద్వారా ఎస్సార్ ఆయిల్ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించగా, నాడు సంస్థ మార్కెట్ విలువ 2,000 కోట్ల రూపాయలుగా ఉంది.

ఎ-టియుఎఫ్‌ఎస్‌ను ఆమోదించిన కేంద్రం

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ ఫండ్ స్కీమ్ సవరణ (ఎ-టియుఎఫ్‌ఎస్)ను కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టెక్స్‌టైల్స్ పరిశ్రమ టెక్నాలజీ ఆధునీకరణ కోసం ప్రస్తుతమున్న టియుఎఫ్‌ఎస్‌ను పునర్‌వ్యవస్థీకరిస్తూ ఈ సవరణను కేంద్రం తీసుకొచ్చింది. మేక్ ఇన్ ఇండియాకు ఇది ఊతమిస్తుందని, లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమేగాక, 30 లక్షలకుపైగా ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

సంక్షిప్త వార్తా సందేశంలోకి వే2ఎస్‌ఎంఎస్

హైదరాబాద్, డిసెంబర్ 30: హైదరాబాద్‌కు చెందిన ఉచిత ఎస్‌ఎంఎస్ సర్వీస్ ప్రొవైడర్ వే2ఎస్‌ఎంఎస్.. వే2 బ్రాండ్ పేరిట ఇకపై సంక్షిప్త వార్తా సందేశాలను ప్రసారం చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ వ్యవస్థాపకుడు రాజు వనపాల తెలిపారు. బుధవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. వే2 అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇంగ్లీషు, తెలుగుతోపాటు మరో 7 భారతీయ భాషల్లో సంక్షిప్త వార్తా సందేశాలను పంపించవచ్చని ఆయన వెల్లడించారు. 400 కేరక్టర్స్‌తో కూడిన మ్యాగ్జిన్ తరహా సందేశాలను పంపించవచ్చని తెలిపారు. దీని వల్ల తమ చందాదారులు ఎప్పుడైనా, ఎక్కడైనా సంక్షిప్త వార్తలను చదువుకోవచ్చని వివరించారు.