బిజినెస్

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభం రూ. 3,455 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 25: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో గతంతో పోల్చితే 20.4 శాతం పెరిగి 3,455.3 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం 2,869.5 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 19,970.9 కోట్ల రూపాయలుగా, నిరుడు 17,324.3 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు మంగళవారం బ్యాంక్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, ఈ సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలంలో బ్యాంక్ నికర లాభం 20.3 శాతం ఎగిసి 6,694.2 కోట్ల రూపాయలుగా, నిరుడు ఏప్రిల్-సెప్టెంబర్‌లో 5,565.1 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా అంతకుముందుతో పోల్చితే 33,827.3 కోట్ల రూపాయల నుంచి 39,293.5 కోట్ల రూపాయలకు చేరింది.