బిజినెస్

టెలినార్ ఇండియా నష్టం రూ. 3,226 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: నార్వేకు చెందిన టెలికామ్ సంస్థ టెలినార్.. భారతీయ విభాగమైన టెలినార్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారీ నష్టాలపాలైంది. ఏకంగా 3,226.31 కోట్ల రూపాయల నిర్వహణ నష్టాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో సంస్థ నష్టం కేవలం 299.52 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బుధవారం టెలినార్ గ్రూప్ అధ్యక్షుడు, సిఇఒ సిగ్వే బ్రెక్కి తెలిపారు. భారతీయ టెలికామ్ రంగంలో పెరుగుతున్న పోటీ మధ్య ఇప్పటికే తట్టుకోలేకపోతున్న టెలినార్.. కాల్ చార్జీలను తక్కువచేసి వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే నష్టాలు పెరుగుతున్నట్లు సంస్థ చెబుతోంది. ఇంటర్నెట్ విషయంలో టెలినార్ వెనకబడిపోవడం కూడా నష్టాలకు దారి తీసింది. కాగా, అధిక స్పెక్ట్రమ్ ధరల కారణంగా భారతీయ వ్యాపారం నుంచి బయటకు వెళ్లే వీలు లేకపోలేదన్న సంకేతాలను టెలినార్ ఇండియా ఇస్తోంది. ఇటీవలి స్పెక్ట్రమ్ వేలంలోనూ టెలినార్ ఇండియా పాల్గొనలేదు. దీంతో 3జి, 4జి సేవలకు టెలినార్ దూరమైంది. అయితే టెలికామ్ రంగంలో భారీ నష్టాలు వాటిల్లినప్పటికీ, భారత్‌లో నూతన వ్యాపారానే్వషణలు కొనసాగిస్తామని సంస్థ ఆర్థిక నివేదికలో బ్రెక్కి స్పష్టం చేశారు.

కస్టమర్లకు ఓలా కొత్త ఫీచర్లు

హైదరాబాద్, అక్టోబర్ 26: క్యాబ్ బుక్ చేసుకోవడం, సమయానికి గమ్యస్థానం చేరుకోవడం క్లిష్టతరమవుతున్న ప్రస్తుత తరుణంలో వినియోగదారులకు రెండు ఫీచర్లను ఆవిష్కరించినట్లు ఓలా సిటివో అంకిత్ భతి తెలిపారు. జస్ట్ ఇన్ టైమ్ ఫీచర్ కింద యూజర్లకు వాస్తవ సమయంలో స్మార్ట్ నోటిఫికేషన్లు అందిస్తారు. క్యాబ్ లభ్యత.. లేదంటే పీక్ ధరలు తగ్గినప్పుడు వినియోగదారులకు సమాచారం ఇస్తారు. దీని ద్వారా యూజర్లు బుక్ చేసుకున్న సమయంలో రైడ్‌ను రియల్ టైమ్ పుష్ నోటిఫికేషన్ల ద్వారా ట్రాక్ చేసుకోవచ్చన్నారు. ఈ విధానం వల్ల వినియోగదారులు సమయం ఆదా చేసుకోవచ్చన్నారు. బుక్ చేసుకున్నప్పటి నుంచి వాహనం వచ్చేలోగా ఉన్న సమయం వివరాలు తెలియచేస్తామన్నారు.
అభిబస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబు
దేశంలో బస్సు టిక్కెట్లను గరిష్ఠంగా బుక్ చేయడంలో ముందంజలో ఉన్న అభిబస్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా సూపర్‌స్టార్ మహేష్ బాబును నియమించినట్లు సంస్థ సివోవో బిజూ మాథ్యూస్ తెలిపారు. వినియోగదారులకు అభిబస్ చేరువయ్యేందుకు మహేష్ బాబు ప్రచారం బాగా ఉపకరిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా, దేశంలోని నలుమూలల విస్తరించిన అభిబస్ సదుపాయాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు కృషి చేస్తానని సూపర్‌స్టార్ మహేష్ బాబు అన్నారు.