బిజినెస్

నన్ను తోలుబొమ్మను చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 26: టాటా సన్స్ నుంచి దిగ్భ్రాంతికర రీతిలో ఉద్వాసనకు గురైన సైరస్ మిస్ర్తి.. ఆ సంస్థ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చైర్మన్‌గా తనకు ఎలాంటి అధికారాలు లేకుండా అచేతనంగా ఉంచారని, అలాగే టాటా గ్రూప్‌లో ప్రత్యామ్నాయ అధికార కేంద్రాలు కూడా వెలిశాయని తెలిపారు. టాటా సన్స్ బోర్డు సభ్యులకు పంపిన ఈ-మెయిల్‌లో అత్యంత తీవ్రమైన ఆరోపణలే ఆయన చేశారు. తనకు ఎలాంటి సమాచారం లేకుండా అలాగే సంజాయిషి ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఈ అతిపెద్ద సంస్థ చైర్మన్ పదవి నుంచి తనను అవమానకర రీతిలో తప్పించారని మిస్ర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా నన్ను తొలగించారన్న ఆయన ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు. నానాటికీ నష్టాల్లో కూరుకుపోతున్న సంస్థలతో గ్రూప్‌ను రక్షించడానికి ప్రయత్నించానన్న మిస్ర్తి.. టాటా ఏవియేషన్ జాయింట్ వెంచర్‌లో 22 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లు దగ్గరగా గమనిస్తున్నాయి. వివరణను కూడా కోరుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై తాము స్పందించబోమని టాటా పవర్ తెలిపింది.

ఐటిసిలో ఎఫ్‌ఎమ్‌సిజి జోష్

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశీయ బహుళ వ్యాపార దిగ్గజం ఐటిసి లిమిటెడ్ స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ద్వితీయ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో గతంతో పోల్చితే 10.49 శాతం పెరిగి 2,500.03 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 2,262.5 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ మేరకు బుధవారం ఐటిసి లిమిటెడ్ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది. ఆదాయం ఈసారి 13,616.61 కోట్ల రూపాయలుగా, పోయినసారి 12,611.29 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక సిగరెట్లుసహా మొత్తం ఎఫ్‌ఎమ్‌సిజి వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయం ఈసారి 8.51 శాతం పెరిగింది. 11,200.13 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 10,321.08 కోట్ల రూపాయలుగా ఉంది. అలాగే హోటళ్ల వ్యాపారం నుంచి 297.34 కోట్ల రూపాయలు, వ్యవసాయోత్పత్తుల అమ్మకాల ద్వారా 1,880.06 కోట్ల రూపాయలు, పేపర్‌బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్ వ్యాపారం నుంచి 1,331.41 కోట్ల రూపాయల ఆదాయం నమోదైంది.