బిజినెస్

మార్కెట్‌లో ‘ధనత్రయోదశి’ మెరుపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: సమృద్ధిగా కురిసిన వర్షాలు, చౌక ధరల నేపథ్యంలో ఈసారి ‘్ధనత్రయోదశి’ అమ్మకాలు పెరిగాయి. నిజానికి గడచిన ఆరు నెలలుగా బంగారం, వెండి అమ్మకాలు అంతంతమాత్రంగా జరుగుతున్నాయి. అయితే సెంటిమెంట్‌కుతోడు పరిస్థితులూ అనుకూలించడంతో ఈసారి ‘్ధనత్రయోదశి’ విక్రయాలు నిరుడుతో పోల్చితే 30 శాతం వరకు పెరిగాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘్ధనత్రయోదశి’ రోజున బంగారం, వెండి వంటి విలువైన, ధరించేందుకు అనువైన లోహాలను కొనుగోలు చేయడం శుభప్రదమని భారతీయులు భావిస్తారన్నది తెలిసిందే. ఉత్తర, పశ్చిమ భారతంలో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఆభరణాల వర్తకులు, ఎమ్‌ఎమ్‌టిసి-పిఎఎమ్‌పి ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఈసారి ధరలు తక్కువగా ఉండటం, వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురవడంతో వ్యవసాయ రంగం ఆశాజనకంగా ఉండటం వంటి కారణాలతో కొనుగోళ్లకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా పసిడి నగలు, వెండి నాణేలకు మార్కెట్‌లో డిమాండ్ ఉందని తెలిపాయి. చౌక ధరలతో పెట్టుబడుల కోసం కూడా కొనుగోళ్లు జరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే నిరుడుతో పోల్చితే ఈసారి 25-30 శాతం అమ్మకాలు అధికంగా అయన ట్లు భావిస్తున్నామని ఎమ్‌ఎమ్‌టిసి-పిఎఎమ్‌పి ఇండియా మార్కెటింగ్ అధ్యక్షుడు విపిన్ రైనా పిటిఐకి శుక్రవారం తెలిపారు.
అయితే ఉదయం నుంచి మందకొడిగా మొదలైన అమ్మకాలు.. సమయం గడుస్తున్నకొద్దీ పుంజుకున్నాయని ఆయన చెప్పారు. పని దినం కావడంతో విధి నిర్వహణ నిమిత్తం కార్యాలయాలకు, ఇతరత్రా చోట్లకు వెళ్లినవారు సాయంత్రం ఎక్కువగా కొనుగోళ్లు జరిపారన్నారు. ప్రధాన నగరాలు, పట్టణాల్లో శుక్రవారం సాయంత్రం నుంచే అమ్మకాలు పుంజుకున్నాయని వివరించారు. ‘గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం 20-25 శాతం ఆభరణాల బుకింగ్స్ అధికంగా ఉన్నాయి.’ అని కల్యాణ్ జ్యుయెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ కల్యాణరామన్ అన్నారు. ‘రెండు నెలల క్రితంతో పోల్చితే ప్రస్తుతం ధరలు తక్కువగా ఉన్నాయి. దీంతో కొనుగోళ్లు పుంజుకున్నాయి. సమృద్ధిగా కురిసిన వర్షాలు దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచడం కూడా కలిసొచ్చింది.’ అని పిసి జ్యుయెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ గార్గ్ తెలిపారు. ‘ఈ ఏడాది ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధం మార్కెట్ పరిస్థితులు బాగున్నాయి.’ అని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యుజిసి) మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం పిఆర్ అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలోనే బంగారం వినియోగంలో భారత్ ముందుండగా, యేటా 900-1,000 టన్నుల వినియోగం దేశవ్యాప్తంగా జరుగుతోంది. అయితే ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య జరిగిన పసిడి దిగుమతులు 247.4 టన్నులుగానే ఉన్నాయి. నిరుడు ఇదే సమయంలో 351.5 టన్నుల పుత్తడిని భారత్ దిగుమతి చేసుకుంది.
తగ్గిన బంగారం ధరలు!
మరోవైపు శుక్రవారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. ‘్ధనత్రయోదశి’ అయినప్పటికీ బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పుత్తడి ధర గురువారంతో పోల్చితే 110 రూపాయలు పడిపోయి 30,590 రూపాయల వద్ద స్థిరపడింది. 99.5 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర 30,440 రూపాయలుగా ఉంది. వెండి ధర మాత్రం యథాతథంగా ఉంది. కిలో ధర 42,700 రూపాయల వద్ద కదలాడుతోంది.
నిరుడు ‘్ధనత్రయోదశి’కి బంగారం ధర 26,230 రూపాయలు, వెండి ధర 35,410 రూపాయలుగా ఉన్నాయి. కాగా, మార్కెట్‌లో ‘్ధనత్రయోదశి’ అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, నగల వ్యాపారుల నుంచి డిమాండ్ కనిపించలేదని, అందుకే ధరలు పతనమయ్యాయని బులియన్ వర్గాలు ట్రేడింగ్ సరళిని విశే్లషిస్తున్నాయి. అంతర్జాతీయంగా చూసినా.. సింగపూర్‌లో ఔన్సు బంగారం ధర 0.17 శాతం దిగజారి 1,265.90 డాలర్లు పలికింది. వెండి ధర కూడా 0.34 శాతం క్షీణించి 17.53 డాలర్లుగా ఉంది.