బిజినెస్

ఔషధ రంగంలో ఆర్థిక నిపుణుల కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: ఔషధ రంగంలో అపారమైన ఉద్యోగావకాశాలున్నాయని, ముఖ్యంగా ఆర్థిక నిపుణుల అవసరం ఎంతో ఉందని బయలాజికల్ ఈ (బిఈ) లిమిటెడ్ ముఖ్య ఆర్థిక అధికారి (సిఎఫ్‌ఒ) చిరాగ్ మెహతా అన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. బుధవారం ఇక్కడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటి) బిజినెస్ స్కూల్‌లో లీడర్‌షిప్ సిరీస్‌లో భాగంగా మొదటి సంవత్సరం విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏ సంస్థకైనా ఆర్థిక శాఖ అత్యంత ప్రధానమైనదని, సంస్థ లాభాల బాటలో నడవాలంటే ఆర్థిక నిపుణుల సూచనలు, అభిప్రాయాలు తప్పక అవసరమన్నారు. ముఖ్యంగా ప్రతి సంస్థకు సిఎఫ్‌ఒ కో-పైలట్ వంటివాడని, అతని ఆలోచనలతోనే సంస్థ అభివృద్ధి చెందుతుందన్నారు. నిజానికి గతంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక విభాగం సంప్రదాయబద్ధంగా కేవలం లాభాలను గణించే వ్యవస్థగానే ఉండేదని, అయితే ఇప్పుడది వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రచించే వ్యవస్థగా రూపాంతరం చెందిందన్నారు. విద్యార్థులు ఈ రంగంలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాలని మెహతా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నైపుణ్యంతో వ్యాపార రంగంలో సృజనాత్మకంగా వ్యవహరించి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు.