బిజినెస్

స్థూల, ఆర్థిక గణాంకాలు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: స్థూల ఆర్థిక గణాంకాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న క్రమంలో మార్కెట్లను అగ్రరాజ్య ఎన్నికలూ ప్రభావితం చేయవచ్చని చెబుతున్నారు.
దీంతో సూచీలు కొంత ఒడిదుడుకులకు లోనుకావచ్చని విశే్లషిస్తున్నారు. అలాగే అక్టోబర్ నెలకుగాను అమ్మకాల వివరాలను ఆటో రంగ సంస్థలు మంగళవారం వెల్లడిస్తుండటంతో ఆ ప్రభావం కూడా స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌పై సహజంగానే ఉంటుందని పేర్కొంటున్నారు. తయారీ, సేవా రంగాలకు సంబంధించి పిఎమ్‌ఐ గణాంకాలు విడుదలవనుండగా, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికానికి (జూలై- సెప్టెంబర్)గాను ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్నాయి.
అంబుజా సిమెంట్స్, టైటాన్, యూనియన్ బ్యాంక్, ఫైజర్ తదితర అగ్రశ్రేణి సంస్థలు తమ ఆర్థిక ఫలితాలను ఈ వారం బహీర్గతం చేస్తున్నాయి. ఇక నవంబర్ 1-2 తేదీల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్ష కూడా ఉండటంతో మదుపరులు తమ పెట్టుబడులపై ఫెడ్ రిజర్వ్ సమీక్ష ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు, అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ వారం భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌కు కీలకం.’ అని శామ్కో సెక్యూరిటీస్ సిఇఒ జిమీత్ మోదీ అన్నారు.
‘దేశీయంగా ప్రముఖ సంస్థల ఆర్థిక ఫలితాలు, విదేశీయంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు భారతీయ స్టాక్ మార్కెట్లపై ఈ వారం ప్రధానంగా ప్రభావం చూపవచ్చు.’ అని క్యాపిటల్‌వయా గ్లోబల్ రిసెర్చ్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సిఇఒ రోహిత్ గదియా అన్నారు.
కాగా, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, దేశ, విదేశీ పరిణామాలు ఎప్పట్లాగే ఈ వారమూ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 135.67 పాయింట్లు క్షీణిస్తే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 55.05 పాయింట్లు పడిపోయినది తెలిసిందే. అయతే ‘సంవత్ 2072’కు చివరి రోజైన శుక్రవారం మాత్రం మదుపరులు పెట్టుబడుల దిశగా ప్రయాణిం చగా, సెనె్సక్స్ 25.61 పాయింట్లు, నిఫ్టీ 22.75 పాయింట్లు పెరిగింది.