బిజినెస్

రామదొరైకి టాటా సన్స్ పగ్గాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 1: టాటా గ్రూప్ సీనియర్ ఉద్యోగి ఎస్ రామదొరై.. ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి సంస్థలైన ఎన్‌ఎస్‌డిఎ, ఎన్‌ఎస్‌డిసిల చైర్మన్‌గా తప్పుకున్నారు. టాటా సన్స్ సంక్షోభం నేపథ్యంలో రామదొరై రాజీనామా కొత్త ఊహాగానాలకు తెరలేపుతుండగా, మిస్ర్తి స్థానంలో ఆయన టాటా గ్రూప్‌నకు సారథిగా వ్యవహరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక 71 ఏళ్ల రామదొరై తాజా పదవుల రాజీనామాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమోదించారని సన్నిహిత వర్గాల సమాచారం. అయితే టాటా సన్స్ నాయకత్వ బాధ్యతల కోసమే రామదొరై ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రామదొరై.. 2013 మే నెలలో ఎన్‌ఎస్‌డిఎ, ఎన్‌ఎస్‌డిసిల చైర్మన్‌గా కేబినెట్ హోదాతో నియమితులయ్యారు. రాజీనామ నేపథ్యంలో సైరస్ మిస్ర్తి ఉద్వాసనతో ఖాళీ అయిన టాటా సన్స్ చైర్మన్ పదవిని భర్తీ చేసేందుకు ఎంపికైన కమిటీ రామదొరై వైపు చూస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు దీనిపై స్పందించేందుకు రామదొరై అందుబాటులో లేకుండగా, అనారోగ్య కారణాల దృష్ట్యా నే ఎన్‌ఎస్‌డిఎ, ఎన్‌ఎస్‌డిసి చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక టాటా సంస్థల బోర్డుల నుంచి ఎన్‌ఎస్ రాజన్, నిర్మల్య కుమార్ తప్పుకున్నారు. ఇండియన్ హోటల్స్ కంపెనీ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రాజన్ రాజీనామా చేస్తే, టాటా కెమికల్స్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నిర్మల్య కుమా ర్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఇరు సంస్థలు మంగళవారం బిఎస్‌ఇకి తెలియజేశాయి. రాజన్ రాజీనామా అక్టోబర్ 28 నుంచి, నిర్మల్య కుమార్ రాజీనామా అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వస్తాయని ఆయా సంస్థలు స్పష్టం చేశాయి.
గ్రూప్ ప్రయోజనాల కోసమే మిస్ర్తికి ఉద్వాసన
ముంబయి: టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్ర్తికి ఉద్వాసన పలకడంపై టాటా గ్రూప్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా స్పందించారు. గ్రూప్‌లోని 100కుపైగా సంస్థల ప్రయోజనాల కోసమే మిస్ర్తిని తొలగించాల్సి వచ్చిందని ఉద్యోగులకు రాసిన లేఖలో మంగళవారం రతన్ టాటా పేర్కొన్నారు. టాటా గ్రూప్ భవిష్యత్తులో విజయపథంలో పయనించాలంటే మిస్ర్తికి గుడ్‌బై చెప్పడం చాలా అవసరమని నొక్కిచెప్పారు. డొకొమో వ్యవహారంలో సొంత నిర్ణయాలకు దిగానన్నది నిజం కాదంటూ మిస్ర్తి తన వాదనను వినిపించిన కాసేపటికే టాటా లేఖ బయటకు వచ్చింది.

రామదొరై