బిజినెస్

భారత్‌లో 48 వేల కోటీశ్వరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

50 లక్షలు-కోటి రూపాయల వార్షిక ఆదాయం ఉన్నవారిలో 54,921 మంది ఉద్యోగులే. వేతనం ద్వారా యేటా కోటి రూపాయలకుపైగా ఆదాయాన్ని పొందుతున్నవారూ 24,942 మంది ఉన్నారు. ఉద్యోగం ద్వారానే ఏడాదికి 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల మధ్య ఆదాయాన్ని అందుకుంటున్నవారు 928 మంది ఉంటే, 10 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయలు పొందుతున్నవారు 232 మంది, 25 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలు పుచ్చుకుంటున్నవారు 32 మంది, 50 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నవారు 10 మంది, 100 కోట్ల రూపాయలకుపైగా గడిస్తున్నవారు ఇద్దరుగా ఉన్నట్లు ఆదాయ పన్ను శాఖ లెక్కల్లో తేలింది.

ముంబయి, నవంబర్ 2: కోటి రూపాయలకుపైగా వార్షిక ఆదాయం పొందుతున్నవారు దేశంలో 10 శాతం పెరిగారని, 50 లక్షలు-కోటి రూపాయల మధ్య ఆదాయం అందుకుంటున్నవారు 22 శాతం ఎగబాకారని 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయ పన్ను శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఆదాయ పన్ను శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం యేటా కోటి రూపాయలు, 5 కోట్ల రూపాయల మధ్య ఆదాయం ఉన్నవారు దేశంలో 45,027 మంది ఉన్నట్లు తేలింది. అలాగే కోటి రూపాయలకు తక్కువగా, 50 లక్షల రూపాయలకు ఎక్కువగా వార్షిక ఆదాయం ఉన్నవారు 98,815 మంది ఉన్నారు.
ఇక ఆశ్చర్యకరంగా వార్షిక ఆదాయం 5 కోట్ల రూపాయలకుపైగా ఉన్నవారు దాదాపు 3 వేల మంది ఉన్నట్లు స్పష్టమైంది. ఒక్క ఏడాదిలో భారతీయుల ఆదాయం ఈ స్థాయిలో పెరగడం ఇదే అత్యధికమని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. 2015-16లో ఇది మరింత పెరగగలదని అంచనా వేసిన ఆదాయ పన్ను శాఖ.. 15-20 శాతం వృద్ధిరేటు నమోదు కాగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఇదిలావుంటే మరో ఆసక్తికర విషయమేమిటంటే భారీగా ఆదాయం లభిస్తున్నవారిలో వేతన జీవులే అధికం. కాగా, భారీ సంస్థల్లో ఉన్నతోద్యోగులు పెద్ద మొత్తంలో పారితోషికాలు అందుకుంటున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠికి నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బోనస్‌లు, పనితీరు ఆధారంగా వచ్చే ప్రోత్సాహకాలు కూడా పెరిగాయని వారు పేర్కొంటున్నారు. ఇది కూడా కోటీశ్వరుల సంఖ్య పరుగులు పెట్టడానికి ఓ కారణమేనని వారు విశే్లషిస్తున్నారు.