బిజినెస్

సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు భారత్‌లో నడవవు: ఆర్‌సి భార్గవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 4: సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో ఇవి నడవవని మారుతి సుజుకి చైర్మన్ ఆర్‌సి భార్గవ శుక్రవారం అభిప్రాయపడ్డారు. డ్రైవింగ్ నిబంధనలు ఎవరూ పాటించరని, కాబట్టే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఇక్కడ విజయం సాధించబోవన్నారు.
బీడి పరిశ్రమ మూతబడితే
నక్సలిజం పెరుగుతుంది: బిఎంఎస్
న్యూఢిల్లీ, నవంబర్ 4: బీడి పరిశ్రమ కుంటుబడితే నక్సలిజం పెచ్చు మీరుతుందని భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. 8,000 కోట్ల రూపాయల విలువైన బీడి పరిశ్రమ దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో విస్తరించి ఉందని తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌సహా చత్తీస్‌గఢ్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో అధికంగా బీడి పరిశ్రమలున్నాయని, ముఖ్యంగా కుటీర పరిశ్రమగా ఉన్న దీనిపై గిరిజనులు ఆధారపడి జీవిస్తున్నారని గుర్తుచేసింది. నిరుద్యోగులు నక్సలిజానికి ఆకర్షితులయ్యే వీలుందని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధంగా పనిచేస్తున్న బిఎంఎస్ ప్రధాన కార్యదర్శి విర్జేశ్ ఉపాధ్యాయ్ శుక్రవారం ఇక్కడ విలేఖరులతో అన్నారు.

ఎల్‌అండ్‌టిలో తగ్గిన ప్రభుత్వ వాటా
న్యూఢిల్లీ, నవంబర్ 4: లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టి)లో స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ ది యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎస్‌యుయుటిఐ) ద్వారా నిర్వహిస్తున్న వాటాలో 1.63 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అమ్మేసింది. దీంతో 2,100 కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఆస్తులు, ఇతరత్రా హక్కులను టేకోవర్ చేసి ఏర్పాటైనదే ఎస్‌యుయుటిఐ. ఎల్‌అండ్‌టిలో ఎస్‌యుయుటిఐ ద్వారా ప్రభుత్వానికి 8.16 శాతం వాటా ఉంది. ఎస్‌యుయుటిఐకి మరో 51 సంస్థల్లోనూ వాటాలుండగా, ఐటిసి (11.17 శాతం), యాక్సిస్ బ్యాంక్ (11.53 శాతం) కూడా ఉన్నాయి.

డబ్ల్యుఎఫ్‌ఇ చైర్‌పర్సన్‌గా చిత్రా రామకృష్ణ
న్యూఢిల్లీ, నవంబర్ 4: నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) ఎండి, సిఇఒ చిత్రా రామకృష్ణ.. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్‌చేంజెస్ (డబ్ల్యుఎఫ్‌ఇ) కొత్త చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. డబ్ల్యుఎఫ్‌ఇలో దాదాపు 45 వేల స్టాక్‌మార్కెట్ లిస్టెడ్ సంస్థలున్నాయి. కాగా, డబ్ల్యుఎఫ్‌ఇ చైర్‌పర్సన్‌గా ఎంపిక కావడంపట్ల శుక్రవారం చిత్రా రామకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. గురువారం కొలంబియాలోని కార్టజెనాలో జరిగిన డబ్ల్యుఎఫ్‌ఇ 56వ సాధారణ సమావేశంలో నూతన చైర్‌పర్సన్‌గా చిత్రా రామకృష్ణను ఎన్నుకున్నారు. చిత్రా రామకృష్ణ నియామకంపట్ల డబ్ల్యుఎఫ్‌ఇ సిఇఒ నందినీ సుకుమార్ హర్షం వెలిబుచ్చారు.