బిజినెస్

పరిశ్రమ అవసరాలను గుర్తించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 4: నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని పేరు కోసం కాకుండా ఫలితాలు కనిపించేలా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన నివాసంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం పురోగతిపై జరిపిన సమీక్షలో ఈ మేరకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన శిక్షణ తరగతులను ప్రారంభించడంలో కొన్ని విశ్వవిద్యాలయాలు వెనుకబడటంపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి ఒకటి కల్లా అన్ని విశ్వవిద్యాలయాల్లో నైపుణ్య శిక్షణ తరగతులు ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. పారిశ్రామిక వృత్తి నైపుణ్య శిక్షణ ద్వారా యువతను తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్న విషయాన్ని గుర్తు చేసిన ముఖ్యమంత్రి.. వచ్చే మూడేళ్లలో ఆరు లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని నిర్దేశించారు. అన్ని విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలన్నారు. అందుకు తగిన రీతిలో ఇక్కడి యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పించాల్సి ఉందన్నారు. అయతే పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో 40 కళాశాలల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ప్రారంభించనున్నామని, ఇందుకోసం 109 బృందాలు పనిచేయనున్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే కళాశాలలను కూడా గుర్తించామని, వీటిని క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తామని వివరించారు.
195 రకాల వృత్తుల్లో నైపుణ్య శిక్షణను ఈ కేంద్రాల ద్వారా అందించనున్నామని, ఇందులో ప్రధానంగా ప్రొడక్ట్ డిజైనింగ్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమేషన్, ఎలక్ట్రికల్, ప్రాసెస్ ఇన్‌స్ట్రమెంటేషన్ తదితర రంగాల్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నామని అధికారులు చెప్పారు. కాగా, పారిశ్రామికవేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో పరిశ్రమల అవసరాలకు ఎంతమంది నైపుణ్యం కలిగిన వారు అవసరమో ఒక అంచనాకు వచ్చి అందుకు తగిన విధంగా శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని పరిశ్రమల శాఖకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం ఆటోమొబైల్, ఫార్మా రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని, ఆయా రంగాల్లో యువతను నైపుణ్యవంతులుగా తయారు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ వేగవంతం చేసి తద్వారా జరిగిన ప్రాంగణ నియామకాల ఆధారంగా అక్రిడిటేషన్‌కు వెళ్లాలని విశ్వవిద్యాలయాలకు సూచించారు. మూస ధోరణిలో కాకుండా ఎప్పటికప్పుడు ఆధునీకరించుకున్న విధానాలతో విద్యనందించాలన్నారు. మన యువతను ప్రపంచంలో ఉత్తమ పారిశ్రామికవేత్తలుగా చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. సిమన్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే ఈ వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సమన్వయం చేస్తుంది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు ఈ కేంద్రాలను అనుసంధానించటం, శిక్షణ తరగతులకు ప్రణాళికల రూపకల్పనను ఎపిఎస్‌డిసి పర్యవేక్షించనుంది.