బిజినెస్

జిడిపి వృద్ధితోనే బలహీనవర్గాలకు ప్రయోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: పేదలకు సంక్షేమ ఫలాలు, కార్మికులకు వేతన పెంపు తదితర ప్రయోజనాలు సవ్యంగా అందాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ అదనంగా 1-1.5 శాతం వృద్ధిరేటును సాధించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ భారత జిడిపి వృద్ధిరేటు 7.5 శాతంగా ఉండొచ్చనే అంచనాలున్నాయి. అయితే ఇది మరో 1-1.5 శాతం పెరగాల్సి ఉంది. అప్పుడే పేదలు, కార్మికులకు వేతన పెంపు, ఇతరత్రా ప్రయోజనాలు సమృద్ధిగా అందించగలుగుతాం.’ అని పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎమ్‌ఎస్) నిర్వహించిన కార్యక్రమంలో జైట్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాన్ని పెంచాలని ఏడవ వేతన సంఘం చేసిన సిఫార్సును అమలు చేయాలంటే 1.02 లక్షల కోట్ల రూపాయల భారం పడుతోందని, ఇదిగాక ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ భారం కూడా ఉందన్నారు. ఆర్థిక కార్యకలాపాలు పెరిగితే ఈ భారాన్ని మోయగలమన్నారు.
ఇదిలావుంటే రాబోయే ఏడాది కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, ప్రైవేట్‌రంగ పెట్టుబడుల తీరుతెన్నులు భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయని జైట్లీ అన్నారు. ఈ రెండే ఇప్పుడు సవాల్ విసురుతున్నాయన్నారు. మరోవైపు కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)పై మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తీరును జైట్లీ ఈ సందర్భంగా ఎండగట్టారు. రాజ్యసభలో కాంగ్రెస్ బలం తగ్గితేనే జిఎస్‌టి అమల్లోకి రాగలదన్నారు. లోక్‌సభలో మెజారిటీ ఉండటంతో జిఎస్‌టి బిల్లును ఆమోదించుకున్న బిజెపి సర్కారుకు.. తగిన బలం లేక రాజ్యసభలో ఆ పని కష్టతరమవుతున్నది తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జిఎస్‌టిని అమల్లోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు కూడా. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అంతేగాక జిఎస్‌టి రేటు 18 శాతాన్ని మించదని, కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్లుగా ఒక శాతం అదనపు పన్ను తొలగించేందుకు సిద్ధమని కూడా జైట్లీ ఇటీవల చెప్పారు. అయినా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జిఎస్‌టి బిల్లు పాసవలేకపోయింది. దీంతో ఏప్రిల్ 1న జిఎస్‌టి రాకపోతే పోయేదేం లేదని జైట్లీ మాట్లాడాల్సి వచ్చింది పరిస్థితి.