బిజినెస్

కొత్త హంగులు.. సరికొత్త నోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రస్తుతం ఉన్న 500, 1000 రూపాయల నోట్లు రద్దయిన నేపథ్యంలో వాటి స్థానంలో సరికొత్త రీతిలో అన్ని రకాల భద్రతా ప్రమాణాలతో కొత్త 2000 రూపాయల, 500 రూపాయల నోట్లను రిజర్వు బ్యాంకు విడుదల చేయబోతోంది. ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మంగళవారం ఈ కొత్త నోట్ల నమూనాను మీడియాకు విడుదల చేశారు.
నవంబర్ 10 నుంచే అధికారికంగా ఈ నోట్లను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఆయన చెప్పారు.కొత్త నోట్లకు అంధులు సైతం గుర్తించగలిగే లక్షణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ నకిలీ కరెన్సీకి ఆస్కారం ఉండదు. త్వరలోనే 10, 20, 100, 1000 రూపాయల కొత్త నోట్లను ముద్రిస్తారు.
పాత నోట్లు ఎక్కడెక్కడ చెల్లుతాయి
500, 1000 కరెన్సీ నోట్ల రద్దయినప్పటికీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అవి కొన్నిచోట్ల చెల్లే విధంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 12 వరకు గుర్తింపు పొందిన అన్ని పెట్రోలు బంకుల్లోనూ ఈ నోట్లు స్వీకరిస్తారు. దేశంలోకి వచ్చే లేదా ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయాల్లో కూడా వీటిని అంగీకరించాలని నిర్ణయించారు. ఆసుపత్రులు, మందుల దుకాణాల్లో ఈ నెల 12 వరకు పాతనోట్లు చెల్లుబాటవుతాయి. నిర్ణీత కాల వ్యవధిలో పాతనోట్లను మార్చుకోలేకపోయిన వ్యక్తులు మార్చి 31, 2017 లోగా ప్రత్యేక ఆర్‌బిఐ కార్యాలయాల్లో వీటిని మార్చుకోవచ్చు. అయితే ఇందుకు వీలుగా తగిన నిర్ధారణ ప్రకటనను సమర్పించాలి.
అనుమానాలుంటే ఫోన్ చేయండి
దేశంలో మంగళవారం అర్ధరాత్రి నుండి 500 రూపాయిలు, వెయ్యి రూపాయిల నోట్లు చెలామణిలో ఉండవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడంతో దేశ ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దాంతో కేంద్రప్రభుత్వం నోట్ల రద్దుపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ, రిజర్వు బ్యాంకు హెల్ప్‌లైన్ సెంటర్లను ప్రారంభించాయి. 011-23093230, 022-22602201 నెంబర్లకు ఫోన్ చేసి అనుమానాలు తొలగించుకోవచ్చని ఆర్ధిక శాఖ అధికారులు పేర్కొన్నారు.
chitram...
కొత్త నోట్లను చూపిస్తున్న శక్తికాంత దాస్, ఉర్జిత్ పటేల్