బిజినెస్

కాల్ డ్రాప్స్‌కు పరిహారం అమలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: కాల్ డ్రాప్స్‌కు నష్టపరిహారం మొదలు పెట్టాలని టెలికాం ఆపరేటర్లను టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ కోరింది. ఈ మేరకు అన్ని టెలికాం సంస్థలకు ట్రాయ్ లేఖలు రాసిందని పిటిఐకి సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. కాల్ డ్రాప్స్‌పై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఒక్కో కాల్ డ్రాప్‌కు రూపాయి చొప్పున వినియోగదారులకు ఆయా నెట్‌వర్క్ సంస్థలు నష్టపరిహారం చెల్లించాలని ట్రాయ్ గత ఏడాది ఓ నిబంధనను తెచ్చింది. అయితే ఒకరోజులో మూడు కాల్ డ్రాప్స్ కంటే ఎక్కువ జరిగినప్పటికీ మూడు రూపాయల కంటే ఎక్కువగా చెల్లించనక్కర్లేదన్న వెసులుబాటును టెలికాం ఆపరేటర్లకు ట్రాయ్ సూచించింది. దీంతో దీనిపై టెలికాం ఆపరేటర్లు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో నష్టపరిహారాన్ని ఈ నెల 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని టెలికాం ఆపరేటర్లకు రాసిన లేఖలో ట్రాయ్ తెలిపింది. అయితే కోర్టు ఆదేశాల తర్వాతే ఈ నష్టపరిహారం చెల్లించవచ్చని, వెంటనే అక్కర్లేదని స్పష్టం చేసింది.

గత ఏడాది క్షీణించిన ఎమ్‌అండ్‌ఎ డీల్స్

న్యూఢిల్లీ, జనవరి 3: గత ఏడాది దేశీయ కార్పొరేట్ సంస్థల ద్వారా జరిగిన విలీనాలు, కొనుగోళ్ల (ఎమ్‌అండ్‌ఎ) విలువ అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 31.5 శాతం పడిపోయింది. 2015లో ఇవి 22.9 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2014లో 33.5 బిలియన్ డాలర్లుగా ఉంది. న్యూస్ కార్ప్‌లో భాగమైన విసిసర్కిల్ నెట్‌వర్క్ ఫైనాన్షియల్ విభాగమైన విసిసిఎడ్జ్ ఈ మేరకు తెలియజేసింది. నిజానికి 2014 సంవత్సరంలో కంటే 2015 సంవత్సరంలో అత్యధికంగా విలీనాలు, కొనుగోళ్లు జరిగినప్పటికీ వాటి విలువ మాత్రం తక్కువ. 2014లో 892 విలీనాలు, కొనుగోళ్ల ఒప్పందాలు కుదిరితే, 2015లో 938 డీల్స్ జరిగాయి.

రాత పరీక్షలతోనే బ్యాంక్ క్లరికల్ పోస్టుల భర్తీ

న్యూఢిల్లీ, జనవరి 3: క్లరికల్ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించాలని, ఇవి తూతూమంత్రంగా ఉండకూడదని ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. దిగువ స్థాయి ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలకు స్వస్తి పలకాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశం ప్రకారం ఆర్థిక శాఖ ఈ నిర్ణయానికొచ్చింది. ఈ క్రమంలోనే ఉద్యోగాలకు సంబంధించి వివిధ రకాల పరీక్షలను నిర్వహించాలని పేర్కొంది.

గత రెండేళ్లలో 16 కోట్ల రూపాయి నోట్లు విడుదల

ముంబయి, జనవరి 3: సుమారు రెండు దశాబ్దాల క్రితం రూపాయి నోట్ల ముద్రణను నిలిపివేసిన కేంద్ర ఆర్థిక శాఖ గత రెండేళ్లలో దాదాపు 16 కోట్ల రూపాయి నోట్లను విడుదల చేసింది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద అడిగిన ప్రశ్నల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ప్రభుత్వం గత 20 ఏళ్లలో ఎన్ని రూపాయి నోట్లను విడుదల చేసిందో వెల్లడించాలని ఢిల్లీకి చెందిన సుభాష్ చంద్ర అగర్వాల్, ముంబయికి చెంది న మనోరంజై రాయ్, ఆర్‌టిఐ కార్యకర్తలు విడివిడిగా కోరారు. దీంతో 1994-95 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4 కోట్ల రూపాయి నోట్లను విడుదల చేసిన ప్రభుత్వం ఆ తర్వాత నుంచి 2013-2014 ఆర్థిక సంవత్సరం వరకూ వాటిని విడుదల చేయలేదని, అయితే 2014-15లో 50 లక్షల రూపాయి నోట్లను, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2015-16లో మరో 15.5 కోట్ల రూపాయి నోట్లను విడుదల చేసిందని కరెన్సీ నోట్ల ముద్రణాలయ సమాచా ర అధికారి, డిప్యుటీ మేనేజర్ (హెచ్‌ఆర్) జి కృష్ణమోహన్ వివరించారు.